Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ కళ్లు చెబుతున్నాయి

ఆ కళ్లు చెబుతున్నాయి

ప్రేమమ్ మళయాల సినిమా.. మలరే పాట. అది ఒక్కటి చాలు సాయిపల్లవి జనాలను తనవైపు నుంచి చూపుతిప్పుకోకుండా చేయడానికి. అదొక్కటే కట్టిపడేసింది జనాలను. ప్రేమమ్ తెలుగు సినిమాకు అదే పాటను శృతిహాసన్ చేసింది నెట్ లో చూసి, జనాలు ఎంత ఎకసెక్కాలు ఆడారో తెలిసిందే. అది శృతి తప్పుకాదు, సాయిపల్లవి గొప్పదనం,. ఆ తరువాత అ అమ్మడు తెలుగు జనాలను ఎలా ఫిదా చేసిందో తెలిసిందే. అనుపమ పరమేశ్వరన్. ఈమె కూడా ప్రేమమ్ అమ్మడే. తెలుగులో తన చూపులతో ఎలా ఆకట్టుకుంటోదో అన్నదీ తెలిసిందే.

వీళ్లిద్దరే కాదు. కేరళకు చెందిన అనేకమంది హీరోయిన్ లు అయ్యారు. కంటి చూపులతో జనాలను కట్టి పడేసారు. లేటెస్ట్ గా ఇంటర్ నెట్ సంచలనం. ప్రియాప్రకాష్ వారియర్. ఈమె కూడా జస్ట్ చూపులతోనే సెన్సెషన్ అయిపోయింది. సావిత్రిగా మనకు కనిపించబోతున్న కీర్తిసురేష్ కళ్లు కూడా భావాలు పలికించేంత గొప్పవే. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో ప్రేమను కళ్లలో కురిపించిన నిత్యా మీనన్ కూడా కేరళ కుట్టినే. సరైన చాన్స్ ఇంకా తగలని అను ఇమ్మాన్యుయేల్ ది కూడా కేరళనే.

తెలుగులో అలా కనిపించి బాలీవుడ్ కు వెళ్లిన ఆసిన్, బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లో ఒకరైన విద్యాబాలన్, ఎక్కువ సినిమాలే తెలుగులో చేసినా, మంచి హిట్ సంపాదించలేకపోయినా, అభినయంలో లోటు లేని ప్రియమణి, వీళ్లంతా తమ కళ్లతో ఆకట్టుకున్నవారే. ఆ మాటకు వస్తే నయనతార.. కళ్లతో ఆమె అభినయం తక్కువ కాదు. మీరాజాస్మిన్ గుర్తుందా.. కళ్లతోనే నవ్వులు రువ్వే హీరోయిన్. ఇంకా వెనక్కు వెళ్తే, అలనాటి దీప. బాలయ్య సరసన అనార్కలిగా నటించిన అమ్మాయి. ఎంత పెద్ద కళ్లో.. ఆ అమ్మాయివి. 

బాలు మహేంద్రను పెళ్లాడి అనుమానాస్పదంగా మరణించిన శోభ మళయాల రంగం నుంచి వచ్చిన నటే. మయూరి తెలుగు సినిమాలో చేసిన సుధాచంధ్రన్ కూడా మంచి భావాలు పలికించిన నటే. తెలుగులో 80వ దశకంలో వరసపెట్టి సినిమాలు చేసిన డ్యాన్సర్ శొభన ది ఆ ప్రాంతమే,. ప్రేమ సినిమాతో వెంకీనే కాదు మనల్ని కూడా ఆకట్టుకున్న రేవతిది కూడా మెస్మరైజ్ చేసే చూపే. ఇలా రాసుకుంటూ పోతే, చాలామంది వున్నారు, మళయాలం నుంచి తెలుగు తెరైపైకి వచ్చి, వాళ్ల అభినయంతో మన జనాల అభిమానాన్ని చూరగొన్న కేరళ హీరోయిన్ల జాబితా చాలా పెద్దదే. 

అయితే ఇప్పుడు లేటెస్ట్ ఏమిటంటే, జస్ట్ రెండు పదులు దాటీ దాటకుండానే వచ్చి, వాలు చూపులతో, కవ్వింపు ముఖ కళలతో గుండెల్ని గాలాలేసి లాగేస్తున్నారు. దీంతో నెటిజన్లు కిందామీదా అయిపోతున్నారు. ఆ చూపులు విరితూపులు. ఆ గాయాలు తీపి గేయాలు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?