ఆ మాటకు వస్తే అల్లువారు మాత్రం ఇస్తారా?

థియేటర్ రెంట్ వస్తుంటేనే సినిమాను తీయరు. అలాంటిది ఇంతో అంతో షేర్ వస్తుంటే తీస్తారా? హైదరాబాద్ జంట నగరాల్లో గీతగోవిందం సినిమాకు ఎక్కువగా థియేటర్లు ఇవ్వలేదని, దీనికి దిల్ రాజే కారణం అని టాక్…

థియేటర్ రెంట్ వస్తుంటేనే సినిమాను తీయరు. అలాంటిది ఇంతో అంతో షేర్ వస్తుంటే తీస్తారా? హైదరాబాద్ జంట నగరాల్లో గీతగోవిందం సినిమాకు ఎక్కువగా థియేటర్లు ఇవ్వలేదని, దీనికి దిల్ రాజే కారణం అని టాక్ బయటకు మొదలైంది. నిజమే చాలా థియేటర్లలో శ్రీనివాస కళ్యాణం వుంది. అది విడుదలై ఇంకా వన్ వీక్ కూడా కాలేదు. వన్ వీక్ అగ్రిమెంట్ మినిమమ్ వుంటుంది. పెద్ద సినిమాలకు అయితే ఇంకా ఎక్కువ రోజుల అగ్రిమెంట్ చేసుకుంటారు. ఫలితాన్ని బట్టి ఖాళీ చేయడం లేదా అన్నది వుంటుంది.

శ్రీనివాస కళ్యాణం విడుదలై ఇంకా వన్ వీక్ కాలేదు. హిట్ కాకపోయినా, షేర్ అయితే వస్తోంది. సహజంగా ఏ నిర్మాతకైనా ఇలాంటి టైమ్ లో హాలీడే వస్తూంది అంటే ఓ ఆశ వుంటుంది. మరికాస్త రికవరీ అవుతుందేమో? అని. అలాంటపుడు థియేటర్లు ఎలా ఖాళీ చేస్తారు. ఈరోజు కూడా క్రాస్ రోడ్స్ లో మంచి కలెక్షన్లే నమోదు అయ్యాయి.

పైగా దిల్ రాజు చేతిలో జంటనగరాల థియేటర్లు లేవు. ఇక్కడ హవా అంతా ఆసియన్ సునీల్ ది. అయితే దిల్ రాజు తన సినిమా తీసేస్తే గీత గోవిందం వేసుకోవచ్చు. ముఖ్యంగా ఎర్రగడ్డ ప్రాంతంలో రెండు మాస్ థియేటర్లు గోకుల్, శ్రీరాములు రెండింట్లో శ్రీనివాస కళ్యాణం వుంది. ఈ రెండింటిలో ఒకటి ఇమ్మని అడిగారు. కానీ దిల్ రాజు నో అన్నారు. కావాలంటే ఆగస్టు 15 హాలీడే అయిపోయిన తరువాత ఇస్తాను అన్నట్లు బోగట్టా. దీనివల్ల అక్కడే ప్లేస్ దొరకలేదు.

అది వదిలేస్తే ఆంధ్ర అంతటా దిల్ రాజు ప్లస్ అల్లు అరవింద్ ప్లస్ యువి కలిపే ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్నారు. గీతగోవిందం ఈస్ట్ లో ఈ ముగ్గురు కలిసే విడుదల చేసారు. అందువల్ల దిల్ రాజు కోరి థియేటర్లు ఇవ్వకపోవడం అన్నది మరీ సీరియస్ ఇస్యూ అని అనుకోవడానికి లేదు. నిజానికి ఇదే పరిస్థితిలో అల్లు అరవింద్ వుంటారనుకుందాం. ఆయన మాత్రం తన సినిమాను అర్థాంతరంగా తీసేస్తారా?

ఇదిలా వుంటే శుక్రవారం నుంచి అదనపు థియేటర్లు దిల్ రాజు వదుల్తారని, వాటిల్లో గీతగోవిందమే వుంటుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే గీతగోవిందం వచ్చిన వారంలో నువ్వెవరు సినిమా వస్తొంది. ఆది పినిశెట్టి-తాప్పి సినిమా. అలాగే ఆటగాళ్లు  సినిమా కూడా. దీంట్లో నారా రోహిత్, జగపతిబాబు నటిస్తున్నారు. మరి వీటికి థియేటర్ల పరిస్థితి ఏమిటో?