బెంగళూరు రేవ్ పార్టీకి చాలా మందే వెళ్లారు. కానీ వారిలో 13 మందిని మాత్రం ఓ ‘క్వీన్ పిన్’ సెట్ చేసి తీసుకెళ్లినట్లు గ్యాసిప్ లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ 13 మంది కేవలం అక్కడికి వచ్చిన గెస్ట్ లను సంతోష పెట్టడానికే తీసుకెళ్లారని టాక్ వినిపిస్తోంది. రేవ్ పార్టీ విచ్చలవిడి వ్యవహారాల్లో పాల్గొనేందుకు, కాస్త భారీగా పేమెంట్ లు ఇచ్చి ఈ పదమూడు మందిని తీసుకెళ్లారని బోగట్టా.
అయితే ఈ పదమూడు మంది ఎవరు అన్నది తెలియదు. బెంగళూరు పోలీసులు కూడా గుర్తుతెలియని వారు అంటూనే కేస్ ఫ్రేమ్ చేసారు. వెళ్లిన వారిలో మహిళలకు సంబంధించి ఒకరిద్దరి పేర్లు బయటకు వచ్చాయి తప్ప, అన్ని పేర్లు కాదు. పైగా ఇలా వెళ్లిన వారు మరీ ఫేమ్ వున్నవారు, నోటెడ్ జనాలు కాదు. అందువల్ల ఎవరు అన్నది తెలుసుకోవడం కాస్త కష్టమే.
ఇదిలా వుంటే నటి హేమ తొందరపడి, తొలి వీడియో వదిలారని, లేదంటే అసలు ఆమె తన అసలు పేరు అయిన కృష్ణవేణి అనే పేరు ఇవ్వడం వల్ల ఎవరికీ తెలిసి వుండే అవకాశం లేదని బెంగళూరుకు చెందిన ఓ పోలీస్ అధికారి కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.
హేమ తొందరపడి తెలివితేటలు ప్రదర్శించడం వల్లనే అనవసరంగా ఆమె ఐడెంటిటీ ఆమెనే బయట పెట్టుకున్నట్లు అయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.