శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన వారి జాబితాలో ప్రముఖ దర్శకుడు, సమాజానికి మెసేజ్ లు ఇచ్చే కొరటాల శివ కూడా వున్నారు. ఆయన మెసేజ్ లు వున్నాయి. అయితే మిగిలిన వారి మాదిరిగానే ఆయనా పెదవి విప్పలేదు. గతంలో అయితే మౌనం అర్థాంగీకారం అనేవారు. ఇప్పుడు మౌనంగా వుంటే ఎవరూ పట్టించుకోరు అన్నది కొత్త రూలు అయింది.
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఆ చాటింగ్ లు కొరటాల శివవే అని తెలుస్తోంది. అయితే ఆ నెంబర్ తనదే కానీ, ఇప్పుడు తాను వాడడం లేదని, ఆ నెంబర్ వాడేటపుడు కూడా ఫోన్ తన అసిస్టెంట్ ల దగ్గర వుండేదని కొరటాల తన సన్నిహితులతో చెబుతున్నట్లు తెలుస్తోంది.
తన ఇంగ్లీష్ మరీ అంత చెత్తగా వుండదని కొరటాల సన్నిహితులతో కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అంటే శ్రీరెడ్డి దగ్గర కొరటాల శివ పేరుతో (నెంబర్ లేదు) వున్న స్క్రీన్ షాట్ లు అయితే ఆయన ఫోన్ నుంచి వెళ్లినవే అని అనుకోవాల్సి వస్తుంది. అయితే ఆయన ఫోన్ నుంచి ఆయన సహాయకులు ఎవరన్నా చేసారా? అన్నది తెలియాలి.
ఇదిలా వుంటే భరత్ అనే నేను ప్రమోషన్లలో భాగంగా, ఆ సినిమా గురించి, పుంఖాను పుంఖాలుగా మాట్లాడుతున్న కొరటాల శివ, ఒక వేళ శ్రీ గురించి ప్రస్తావిస్తే మాత్రం ఇప్పుడు తాను బిజీ అని తరువాత మాట్లాడతానని దాటేస్తున్నారు. సినిమా హిట్ అయితే అప్పుడు మాట్లాడతారేమో? లేదూ అంటే త్రివిక్రమ్ లా మీడియా ముందుకు మరి వచ్చే అవసరమే వుండదు. సో ఖేల్ ఖతమ్.