`1` సినిమా ఫస్ట్ షోకే డివైడ్ టాక్ భీకరంగా వచ్చేసింది. సినిమా కంటెంట్, మహేష్ పెర్‌ఫార్మెన్స్ గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఇంత కన్‌ఫ్యూజ్ కథ మహేష్‌కి ఎలా చెప్పి ఒప్పించాడబ్బా?? అంటూ ముక్కున వేలేసుకొన్నారు సీనీ జనాలు. నిజానికి ఇంత బీభత్సమైన థాట్‌తో మహేష్ ఓ సినిమా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.
కథ చూడడానికికే ఇంత కన్‌ఫ్యూజన్ అయితే మహేష్‌కీ, ముగ్గురు నిర్మాతలకూ ఈ మూడు గంటల నేరేషన్ ఎలా ఇచ్చాడో, అందులో ఏముందని వీళ్లంతా ఒప్పుకొన్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి గజిబిజి కథకి చెప్పి ఒప్పించడం అంటే అది నిజంగా సుకుమార్ గొప్పదనమే. కాకపోతే ఈ సినిమాని త్రోసి పుచ్చే విషయంలో మాత్రం ప్రేక్షకుల్లో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు.
సుకుమార్ కథల్లో భారీ తెలివితేటలుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ సంగతి మైండ్‌లో ఫిక్స్ చేసుకొనే `1` థియేటర్‌కి వచ్చారు. కానీ ఇన్ని తెలివితేటలు భరించలేక బాబోయ్ అంటున్నారు. సుకుమార్ ఇప్పటికైనా దిగివచ్చి, సామాన్య ప్రేక్షకుడి ఆలోచనకు అందే సినిమా తీస్తాడేమో చూడాలి.