ర‌జ‌నీ త‌ర‌వాత ఎన్టీఆర్‌…

జ‌పాన్‌లో ర‌జ‌నీకాంత్‌కి అభిమానులు ఎక్కువ‌. భార‌తీయ న‌టుల్లో వాళ్లు ఆరాధించేది ఆ త‌మిళ సూప‌ర్ స్టార్‌నే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ర‌జ‌నీ స‌ర‌స‌న చేరాడు. ఇప్పుడు జ‌పాన్ ప్రేక్షకుల‌కు ఎన్టీఆర్‌ మానియా ప‌ట్టుకొంది.  Advertisement…

జ‌పాన్‌లో ర‌జ‌నీకాంత్‌కి అభిమానులు ఎక్కువ‌. భార‌తీయ న‌టుల్లో వాళ్లు ఆరాధించేది ఆ త‌మిళ సూప‌ర్ స్టార్‌నే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ర‌జ‌నీ స‌ర‌స‌న చేరాడు. ఇప్పుడు జ‌పాన్ ప్రేక్షకుల‌కు ఎన్టీఆర్‌ మానియా ప‌ట్టుకొంది. 

అక్కడ టీవీ ఛాన‌ళ్లు ఎన్టీఆర్‌పై ప్రత్యేక కార్యక్రమాల‌ను ప్రసారం చేస్తున్నాయి. ఎన్టీఆర్ స్టెప్పులు, సంభాష‌ణ‌లు ప‌లికే విధానాన్ని అక్కడి ప్రేక్షకుల‌కు ప‌రిచ‌యం చేస్తున్నాయి. దాంతో అక్కడ ఎన్టీఆర్‌కి అభిమాన గ‌ణం మొద‌లైంది. 

జ‌పాన్‌లో త్వర‌లో ఓ ఇండియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ నిర్వహించ‌బోతున్నారు. అక్కడ ఎన్టీఆర్ సినిమాల్ని ప్రద‌ర్శిస్తార‌ట‌. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ని అతిథిగా ఆహ్వానించాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ పాలోయింగ్‌కి ఇంత‌కంటే నిద‌ర్శనం ఏం కావాలి??