ఆడతనం డాన్స్‌ వల్లా లేక జన్యుపరంగానా..

సాధారణంగా సంప్రదాయపు డాన్సులు నేర్చుకునే మగవాళ్లకు ఎంతో కొంత ఆడంగితనం కనిపించడం సహజం. అయితే పూర్తి స్థాయిలో స్త్రీ హావభావాలతో కనిపించే డాన్స్‌ మాస్టర్‌ మాత్రం. ‘శివశంకర్‌’నే చెప్పుకోవాలి. తమిళనాడుకు చెందిన ఆయన ఎప్పటి…

సాధారణంగా సంప్రదాయపు డాన్సులు నేర్చుకునే మగవాళ్లకు ఎంతో కొంత ఆడంగితనం కనిపించడం సహజం. అయితే పూర్తి స్థాయిలో స్త్రీ హావభావాలతో కనిపించే డాన్స్‌ మాస్టర్‌ మాత్రం. ‘శివశంకర్‌’నే చెప్పుకోవాలి. తమిళనాడుకు చెందిన ఆయన ఎప్పటి నుండో డాన్స్‌ మాస్టర్‌గా ప్రసిద్ధిగాంచాడు. 

శివ తాండవం, దేవతల డాన్స్‌ యాక్షగానంలాంటి విశిష్ట డాన్స్‌లకు ఆయన పెట్టింది పేరు. అలాంటి శివశంకర్‌ నడకలో, మాటల్లో, చూపుల్లో పూర్తిగా స్త్రీలను మరపించేస్తాడు. అది ఆయనకు డాన్సుల కారణంగా వచ్చిందా? లేక జన్యుపరంగా వచ్చిందా? అని ఆరా తీస్తే దానికి సమాధానం జన్యుపరంగానే వచ్చిందని చెబుతున్నారు కొందరు. 

డాన్సుల్లో ప్రసిద్ధి చెందిన రాజారెడ్డి, వెంపటి సత్యంలాంటి వారు డాన్సుల్లో తప్ప బయట హుందాగా కనిపిస్తారు. అలాంటిది ప్రత్యేకంగా ‘శివశంకర్‌’ అటూ ఇటూ కాని వ్యక్తిలా కనిపిస్తూ ఎంతో ఫన్‌ సృష్టిస్తాడు. అయితే ఆయనకు పెళ్లయ్యింది, పిల్లలు కూడా ఉన్నారు. ఒకబ్బాయి తండ్రితో కలిసి డాన్స్‌ కంపోజ్‌ చేస్తుంటాడు. శివశంకర్‌ డాన్సుల్లోనే కాదు అనేక పాత్రలు చేసి కూడా మెప్పించాడు.