మంచు ఫ్యామిలీకి సంపూ కలిసొచ్చాడు

మంచు ఫ్యామిలీకి స్వంత హీరోల సినిమాలు అంతగా కలిసిరాలేదు. కానీ ఇప్పుడు మంచు విష్ణు తెలివిగా సంపూర్ణేష్ బాబుతో తీసిన సినిమా బాగా కలిసివచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో…

మంచు ఫ్యామిలీకి స్వంత హీరోల సినిమాలు అంతగా కలిసిరాలేదు. కానీ ఇప్పుడు మంచు విష్ణు తెలివిగా సంపూర్ణేష్ బాబుతో తీసిన సినిమా బాగా కలిసివచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో కానిచ్చారు. 

సుమారు కోటి న్నరతో ముగించారని వినికిడి. ఈ సినిమా బిజినెస్ బాగా జరిగిందని, అంతకు అంతా మిగిలిందని టాక్. అంటే ఖర్చులన్నీ పోను విష్ణుకు కోటిన్నర నుంచి రెండు కోట్లు అన్నమాట. లక్ష్మీకి దొంగాట కూడా ఫరవాలేదు అనిపించింది. ఖర్చులతో చూసుకుంటే ఆ సినిమా కూడా అలా అలా లాగేసింది. 

ఇక ఇప్పుడు ధర్మ సూక్ష్మం తెలిసింది కాబట్టి, మంచు ఫ్యామిలీ ఈ తరహా చిన్న సినిమాలను షురూ చేస్తాయేమో?