నెమ్మదించిన ‘ప్రచార’ బిజినెస్‌.!

మా ప్రోడక్ట్‌కి ప్రచారం చేస్తారా.? లక్షలిస్తాం..  Advertisement మా సంస్థకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుంటారా? కోట్లు ఇస్తాం.. ఇలా సెలబ్రిటీల్ని ముగ్గులోకి లాగుతున్నాయి వివిధ సంస్థలు. ఆ సెలబ్రిటీల కారణంగా ఆయా సంస్థలు ఆర్థికంగా…

మా ప్రోడక్ట్‌కి ప్రచారం చేస్తారా.? లక్షలిస్తాం.. 

మా సంస్థకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుంటారా? కోట్లు ఇస్తాం..

ఇలా సెలబ్రిటీల్ని ముగ్గులోకి లాగుతున్నాయి వివిధ సంస్థలు. ఆ సెలబ్రిటీల కారణంగా ఆయా సంస్థలు ఆర్థికంగా ఎదుగుతోంటే, వాటి పేరు చెప్పి సెలబ్రిటీలూ ఆర్థికంగా బలపడ్తున్నారు. వెరసి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఈ ‘బిజినెస్‌’ భలే గొప్పగా సాగిపోతోంది. అనూహ్యంగా తెరపైకొచ్చింది ‘మ్యాగీ నూడుల్స్‌’ వివాదం. ఇదే ఇప్పుడు ఈ బిజినెస్‌ కొంప ముంచుతోంది.

ఒక్క మ్యాగీ వివాదంలో కూరుకుపోతే, మొత్తం ‘ప్రచార బిజినెస్‌’ కొంప ఎలా మునుగుతుంది.? అనే అనుమానాలు రావొచ్చు. కానీ, ఓ బంగారు దుకాణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తినే తీసుకుందాం. సదరు సంస్థ తూకంలో అక్రమాలకు పాల్పడినా, ఆ సంస్థ అమ్మకాలు జరిపే బంగారు నగల్లో ఏ విధమైన క్వాలిటీ తేడాలున్నా.. ఆ సంస్థతోపాటు, ప్రచారకర్తలపైనా కేసులు నమోదు చేయడానికి వీలు కల్పించింది ‘మ్యాగీ’ వివాదం.

కూల్‌ డ్రిరక్స్‌ అయినా, విద్యా సంస్థలైనా.. ప్రచారం లేనిదే ‘వ్యాపారం’ సరిగా సాగని పరిస్థితి. సినిమా ప్రచారం వేరు. నచ్చితే సినిమా చూస్తాడు, లేకపోతే లేదు. దానివల్ల ప్రాణహాని వుండదు.. నష్టం కూడా వుండదు. కాస్సేపు ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటే సినిమా హిట్టవుతుంది, లేదంటే సినిమా ఢాం మంటుంది. సినిమా ప్రచారం వేరు. కానీ సినిమా ప్రచారాన్ని మించిపోయింది, మిగతా సంస్థలకు సంబంధించిన ప్రచారం.

ఫలానా సంస్థలో చదివించండి.. అంటూ సెలబ్రిటీలు విద్యా సంస్థలకు ప్రచారం నిర్వహించడం చూసి అంతా ఫక్కున నవ్వుకుంటున్నారు. అదే సంస్థల్లో విద్యార్థులు అపరిశుభ్రవాతావరణంలో పెరుగుతున్నారన్న వార్తలు నిత్యం మీడియాలో దర్శనమిస్తున్నాయి. అలాంటప్పుడు ఆయా సెలబ్రిటీలపై కేసులు ఎందుకు నమోదు చేయకూడదు.? చెప్పుకుంటూ పోతే వ్యవహారం చాలానే వుంది.

ప్రచారం తప్పు.. అని కాదుగానీ, ఆ ప్రచారం చేసే విధానం, అందుకు సంస్థలు అనుసరిస్తున్న విధానం.. సెలబ్రిటీలను వాడుకుంటున్న తీరు, ప్రజల్ని మభ్యపెడ్తున్న వైనం.. ఇవన్నీ ఆక్షేపణీయమే.

మొత్తమ్మీద, తాజా అంచనాల ప్రకారం ఒక్కసారిగా ఈ ప్రచార బిజినెస్‌ మందగించిందట. మరీ ముఖ్యంగా ఆహారోత్పత్తుల ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి గత కొన్ని రోజులుగా ఎవరూ ముందుకు రావడంలేదట. ఎనర్జీ డ్రిరక్స్‌, బూస్ట్‌, హార్లిక్స్‌ లాంటివి.. ఇందులో వున్నాయని సమాచారం. అదే నిజమైతే, కోట్లాది రూపాయల ‘ప్రచార బిజినెస్‌’ అయోమయంలో పడిపోతుంది. మరక మంచిదే.. అన్నట్టు, ప్రచార బిజినెస్‌ సంక్షోభం.. ప్రజారోగ్యానికి మంచిదే మరి.!