రామ్ చరణ్, అల్లు అర్జున్, విష్ణు, నాని, బ్రహ్మానందం కుమారుడు గౌతమ్, ఈ ప్రేమ పెళ్లిళ్ల హీరోల జాబితాలో మరో పేరు వినిపిస్తోంది. నటుడు సాయి కుమార్ కొడుకు, హీరో ఆది పేరు ఇప్పుడు గుసగుసల జాబితాలో చేరింది. ఆది ప్రేమ వివాహం చేసుకుంటానని టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ప్రేమవివాహం పాపమూ కాదు..అపరాథమూ కాదు.
సాయికుమార్ కుటుంబం అంతా చాలా బ్రాడ్ మైండెడ్ గా వుంటారని అంటారు. అందువల్ల ఇందులో వివాదమూ రాదు. జస్ట్ జనాల క్యూరియాసిటీ అంతే. అయితే అమ్మాయి ఎవరు? ఏమిటి అన్న వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. కొంతకాలం కిందటే సాయికుమార్ తన కుమార్తెకు అంగరంగవైభవంగా పెళ్లి చేసారు. మరోసారి వారింట్లో ఇప్పుడు పెళ్లి బాజాలు మోగుతాయన్నమాట.