మెగా క్యాంప్ లో సినిమా చేయడం అంటే 14 రీల్స్ లో చుట్టేసినట్లు వుండదు వ్యవహారం. అందునా రామ్ చరణ్ సినిమా అంటే అడుగు అడుగు నారాయణ అన్నట్లు ప్రతి దాంట్లోనో చిరంజీవి ప్రవేశం, పరిశీలన, పర్మిషన్ అవసరం. కృష్ణవంశీ నానా ఇబ్బందులు పడ్డాడు. ఆఖరికి పాపం పరుచూరి బ్రదర్స్ సూపర్ విజన్ కూడా భరించాల్సి వచ్చింది. డబ్బులు నిర్మాత వైనా ఖర్చుకు డైరక్షన్ మెగా స్టారు దే. ఇలాంటి క్యాంప్ లో కథ ఓకె కావాలంటేనే బోలెడు తతంగం. ముఫై మూడు మార్పులు, అరవై ఆరు చేర్పులు.
అందునా ఆగడు లాంటి లాకా లూకా కథ అల్లి, సినిమాను పల్టీ కొట్టించిన బ్యాడ్ రిమార్కు శ్రీను వైట్లను వెన్నాడుతూనే వుంటుంది. అందవల్ల అక్కడ మరింత నిబంధనాలు వుంటాయి. వీటన్నింటిని దాటుకుని కథ ఓకె కావాలి. ఆపై స్టార్ కాస్ట్ లో మళ్లీ వేళ్లు కాళ్లు వుంటాయి. ఆ తరువాత సినిమా. వీటన్నింటిని తట్టుకుని శ్రీను వైట్ల ముందుకు వెళ్లాడా..లేక మరే ఆప్షన్ దగ్గర లేదు కనుక సర్దుకుపోయి సినిమా చేస్తాడా అన్నది తాజా డిస్కషన్.