బాహుబలి ప్రభాస్ డైరక్ట్ బాలీవుడ్ సినిమా ఆదిపురుష్ ప్రకటన వచ్చేసింది. రామాయణం బ్యాక్ డ్రాప్ లో సినిమా అని తెలుస్తూనే వుంది. అందులో హీరో రాముడే కాబట్టి ప్రభాస్ ఆ పాత్రనే చేయడం అన్నది పక్కా. అయితే అసలు ఈ సినిమా ఏమిటి? రామాయణం మొత్తం చూపిస్తారా? లేదా కొంత భాగమా? అసలు ఏమిటి కథ కమామిషు అన్న డిస్కషన్లు ప్రారంభమయ్యాయి.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం రామాయణంలో కీలకమైన యుద్దకాండ ను ఆదిపురుష్ గా తీయబోతున్నారని తెలుస్తోంది. హనుమాన్ లంకకు వెళ్లడం దగ్గర నుంచి రావణ సంహారం వరకు సినిమా వుంటుందని తెలుస్తోంది. అంటే హనుమాన్ సముద్రాన్ని దాటటం, లంకా దహనం లాంటి ఇంట్రస్టింగ్ ఎపిసోడ్ లు, రోజుల తరబడి సాగిన రామరావణ యుద్దం లాంటి మాంచి కీలకమైన సన్నివేశాలు సినిమాలో వుంటాయన్నమాట.
ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక త్రీడీ, గ్రాఫిక్స్ సాంకేతికత వాడి రామాయణ యుద్ద సన్నివేశాలు అన్నీ భారీగా తీస్తారని అనుకోవాలి. ఈ జనరేషన్ కు కూడా ఈ సన్నివేశాలే ఆసక్తికరంగా వుంటాయి. పైగా మాస్ జనానికి కూడా ఈ ఫైటింగ్ సీన్లు అంటే భలేగా నచ్చుతాయి. అందుకే రాముడి పుట్టిన దగ్గర నుంచి, సీతను దూరం చేసుకున్న వరకు వదిలేసి, సీతను ఎలా వెనక్కు తెచ్చుకున్నాడు అన్నది మాత్రం చూపిస్తారన్నమాట.