ఆదిపురుష్..సి జి వర్క్ నే కీలకం

ప్రభాస్-ఓమ్ రౌత్ కాంబినేషన్ లో టీ సిరీస్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదల అని ముందే ప్రకటించారు. కానీ సంక్రాంతి కి కాకుండా ముందుగానో, వెనుకగానో వస్తుందని…

ప్రభాస్-ఓమ్ రౌత్ కాంబినేషన్ లో టీ సిరీస్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదల అని ముందే ప్రకటించారు. కానీ సంక్రాంతి కి కాకుండా ముందుగానో, వెనుకగానో వస్తుందని ఇప్పుడు వినిపిస్తోంది. 

ఇందులో నిజా నిజాలు ఎలా వున్నా, ఆదిపురుష్ విడుదల కావాలంటే దానికి చేస్తున్న సిజి వర్క్ పెర్ ఫెక్ట్ క్వాలిటీతో రావాలన్న కండిషన్ ను ప్రభాస్ విధించినట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ టీజర్ కు విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. దాంతో తెలుగు వెర్షన్ తీసుకోవాలనుకున్న ప్రభాస్ సన్నిహితులు అయిన యువి సంస్థ ఆందోళనకు గురయినట్లు తెలుస్తోంది. 

ప్రభాస్ కూడా సిజి వర్క్ విషయంలో దర్శకుడు ఓం రౌత్ కు గట్టి క్లాస్ పీకినట్లు బోగట్టా. ఆ విషయంలో తనదీ భరోసా అని దర్శకుడు ప్రభాస్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిజి వర్క్ లు పూర్తిగా చూసి, సంతృప్తి చెందిన తరువాతే విడుదలకు వెళ్తారని, సిజి వర్క్ లు బాగులేకుంటే యువి సంస్థ తెలుగు వెర్షన్ తీసుకోవడంలో వెనకడుగు వేసినా ఆశ్చర్యం లేదని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

ఆదిపురుష్ తెలుగు వెర్షన్ తీసుకోవాలంటే దాదాపు వంద కోట్ల మేరకో, ఆపైనో ఖర్చు చేయాల్సి వుంటుంది. అంత రిస్క్ చేస్తే, సినిమా బాగుంటే అంతకు అంతా వస్తుంది కానీ గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోతే పరిస్థితి దారుణంగా వుంటుంది. 

అసలే సాహో, రాధేశ్యామ్ సినిమాలతో దెబ్బతిన్న యువి సంస్థ మరో షాక్ తినడానికి సిద్దంగా లేదు. అందుకే గ్రాఫిక్స్ పనినే ఆది పురుష్ కు ఇప్పుడు కీలకంగా మారింది.