సమంత నటించిన హీరోయిన్ సెంట్రిక్ థ్రిల్లర్ సినిమా యశోద. ఇటీవల విడుదలయిన సినిమా ట్రయిలర్ మంచి అప్లాజ్ వచ్చింది. దీంతో బిజినెస్ డీల్స్ మొత్తం క్లోజ్ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఆసియన్ సినిమాస్ సంస్థ, దిల్ రాజు కలిసి 10 కోట్లకు తీసుకున్నారు. కర్ణాటకలో సినిమాను హాట్ స్టార్ సంస్థ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది. కార్తికేయ 2 సినిమాను బాలీవుడ్ లో విడుదల చేసిన సంస్థ హిందీ వెర్షన్ ను తీసుకుంది.
అమెజాన్ ప్రతినిధులు సినిమా చూసి 22 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ హక్కులు రెండు కోట్ల మేరకు బేరాలు సాగుతున్నాయి. ఇక మిగిలింది శాటిలైట్ మాత్రమే
సినిమాకు బాగానే ఖర్చయింది.సమంత, రావు రమేష్, సంపత్ రాజ్, మురళీ శర్మ, ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇలా భారీ స్టార్ కాస్ట్ వుండడంతో 30 కోట్లకు పైగా ఖర్చయింది. పబ్లిసిటీ, వడ్డీలు అన్నీ కలిపి 40 కోట్ల మేరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సర్రోగసీ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాంచారు.