మహేష్ బాబు ఆగడు సినిమా ఎలా వుందీ అన్నది కాస్సేపు పక్కన పెడదాం. కానీ ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ ఇంతా అంతా కాదన్నది అందరూ అంగీకరించాల్సిన సంగతి. తెలుగునాట సూపర్ స్టార్ అన్నది పేరు ముందు పెట్టుకునే టైటిల్ గా కాకుండా, రియల్ గా చూడాలంటే ఇలాంటి క్రేజ్ నే ఆధారంగా చేసుకోవాలి. రోబో సినిమా వచ్చినపుడు పుట్టిన క్రేజ్ ఇంతా అంతా కాదు. స్పేషల్ షోలు,.కంపెనీలు తమ సిబ్బందికి ఎంకరేజ్ మెంట్ గా సినిమా చూపించడాలు, ఇలాంటి వైనాలు చాలా జరిగాయి. మళ్లీ అలాంటి హడావుడి కాస్త రాజమౌళి ఈగ సినిమాకు వచ్చింది. తెలుగునాట అలాంటి స్టార్ ఎవరైనా వున్నారా అంటే అది మహేష్ బాబే అన్నది డౌటర్ లేని వ్యవహారం. ఇది మిగిలిన నటుల అభిమానులను బాధపెట్టడానికి చెబుతున్న సంగతి కాదు. ఎవరి అదృష్టం. ఎవరి కెరియర్..ఎవరి క్రేజ్ వారిది. దానికి ఎవరూ ఏమీ చేయలేరు ఎన్టీఆర్ ఎన్టీఆరే..ఎఎన్నార్ ఎఎన్నారే.
దూకుడు తరువాత ఏ మాత్రం పెద్దగా విషయం లెకుండానే కేవలం మహేష్ చరిష్మాతో గట్టెక్కేసిన సినిమా బిజినెస్ మన్. మహేష్ కాకుండా మరే నటుడు అయినా చేసి వుంటే, మొదటి వారంతో ఇంటికి పోయి వుండేది. ఇక వన్ సినిమాకు వసూళ్ల సంగతి ఎలా వున్నా, మంచి పేరు వచ్చింది. మంచి సినిమా, మన జనాలకు ఎక్కలేదు అన్న టాక్ వచ్చింది.
కానీ ఆగడు వ్యవహారం వేరు. పూర్తిృగా దర్శకుడు అత్యంత గర్హనీయమైన నిర్లక్ష్యానికి అది పరాకాష్ట. ఎలా తీసినా చూసేస్తారులే అన్న ధీమాకు చిరునామా. అదే కనుక కాస్త మంచి కథ ఎన్నుకుని, దేవీ లాంటి మంచి సంగీత దర్శకుడితో క్యాచీ పాటలు చేయించి వుంటే సినిమా ఎక్కడికో వెళ్లి వుండేది. వన్ లాంటి పరాజయం తరువాత కూడా ఆగడు కు ఇంత క్రేజ్ వచ్చిందంటే ఏమనుకోవాలి. సినిమా జనం అంతా మొదటి రోజే ఆ సినిమాను చూడాలని ఎగబడ్డారంటే ఏమనుకోవాలి.
కానీ…ఇంతటి క్రేజ్ వచ్చినా ఆగడు సినిమా అత్తారింటికి దారేది పేరిట వున్న ఫస్ట్ డే కలెక్షన్ రికార్డు ఎందుకు బ్రేక్ చేయలేకపోయింది. అత్తారింటకగి దారేది ఫస్ట్ డే కలెక్షన్లు 10 కోట్ల డెభై లక్షల దగ్గరలో రికార్డుగా నిలిచాయి. ఇంతవరకు ఆ రికార్డు పదిలంగా వుంది. ఆగడు దాన్ని బ్రెక్ చేస్తుదని అనుకున్నారు. అయితే ఆగడు కలెక్షన్లు తొమ్మిది కోట్ల అరవై అయిదు లక్షల దగ్గర ఆగిపోయాయి. అంటే దగ్గర దగ్గర ఓ కోటి రూపాయిలు తెడా.
ఇదే కనుక ఆగడు సినిమా 26న విడుదలై వుంటే ఆ రికార్డు బ్రేక్ అయ్యేదేమో అని అభిమానులు అనుకుంటున్నారు. ఎందుకంటే ఎంత ఎక్కువ స్క్రీన్లు వేసినా, 26న అయితే మరిన్ని స్క్రీన్ లు అందుబాటులోకి వచ్చి వుండేవన్నది వాస్తవం. పవర్ వచ్చి వారమే కావడంతో దాని థియేటర్లు తొంభై శాతం అలాగే వున్నాయి. గీతాంజలి, లవర్స్ లాంటి చిన్న సినిమాలు కూడా చాలా సెంటర్లలో ఆడుతున్నాయి.
ఇక రభస ఎంత డిజాస్టర్ అనుకున్నా ఇంకా కొన్ని థియేటర్లలో వుంది. అదే 26న అయి వుంటే వీటన్నింటికి మరో వారం గడిచేది కాబట్టి, కనీసం మరో వంద స్క్రీన్ లు అందుబాటులోకి వచ్చి వుండేవి. అప్పుడు ఈ మార్కు చేరుకోవడానికి అవకాశం వుండదేదేమో? అయితె అప్పుడు ఇదే రిజల్టు అయితే కనుక, పది రోజులు గ్యాప్ దొరక్క, బయ్యర్లు కుదేలైపోయేవారు. రికార్డుల కన్నా బయ్యర్లు సేఫ్ కావడం ముఖ్యం కదా. కానీ ఒకటి స్పష్టమైంది. అటు ఇటు పది రోజులు గ్యాప్ వుంటేనే రికార్డులైనా బద్దలవుతాయి. బయ్యర్లేనా సేప్ అవుతారు.