Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గోదాలో గోవిందుడు

గోదాలో గోవిందుడు

ఈ సీజన్ లో సినిమా అభిమానుల అంచనాలు వేసుకున్న సినిమాలు నాలుగు. ఎన్టీఆర్ రభస, రవితేజ పవర్, మహేష్ ఆగడు, రామ్ చరణ్ గోవిందుడు అందరి వాడేలే. 

ఈ నాలుగు సినమాలపై అభిమాన జనం చాలా ఆశలే పెట్టకున్నారు, ఏ హీరో అభిమానులు ఆ హీరో సినిమానే కుమ్మేస్తుందని అంచనాలు వేసుకున్నారు. ఇప్పటికి మూడు సినిమాలు విడుదలయ్యాయి. కలెక్షన్ల పరంగా చూస్తే ఎన్టీఆర్ రభస డిజాస్టర్ గా మిగిలింది. బడ్జెట్ కు కలెక్షన్లుకు పొంతన వేసుకుంటే రవితేజ పవర్ ఫరవాలేదనే రేంజ్ లో మిగిలింది. ఇక ఈ ఏడాదికే సూపర్ బ్లాక్ బస్టర్ గా మిగులుతుందని అభిమానంతో సంబంధం లేకుండా అందరూ అంచనా వేసుకున్న సినిమా ఆగడు. దాని ఖర్చు, దానికి వచ్చిన హైప్ తో చూసుకుని, దాని వసూళ్ల లెక్కలు తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. అయితే దసరా సెలవులు ప్రారంభం కావడం, వేరే పెద్ద సినిమా అంటూ పెద్దగా పోటీలో లేకపోవడం ఆగడుకు కలిసి వచ్చే అంశాలు. సోమవారం తరువాత కానీ ట్రెండ్ తెలియదు

మిగిలినది ఒక్కటే

ఇప్పుడు ఇక జనం చూపులు గోవిందుడు మీద నిలిచాయి. ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా జనం ముందుకు వస్తోంది. పైగా మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే అంత మాస్ హైప్, అంచనాలు దీనికి లేవు. అంతగా ఫామ్ లో లేని దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అది కూడా ఓ కారణం. యంగ్ హీరోలు ఫ్యామిలీ సినిమాలను ఎంచుకుంటున్న సీజన్ కావడంతో, ఇది ఎలా వుంటుందో అన్నది ఇంకా అంచనాలకు అదండం లేదు. రామ్ చరణ్, కాజల్ జోడీ మరోసారి విజయం సాధిస్తుందనే నమ్మకంతో అభిమానులు వున్నారు.

దర్శకులదే అంతా

రభస, ఆగడు, పవర్ కు వచ్చిన మైనస్ అన్నీ కేవలం దర్శకుల వల్లే కావడం విశేషం. రభస సినిమా కథ, కథనాలు సినిమా ఓక దారిలో ప్రారంభమై మరో దారిలో పయనించడం అన్నది దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ వైఫల్యాన్ని స్మష్టంగా చూపిస్తాయి. ఇక ఆగడు సినిమా పూర్తిగా దర్శకుడు శ్రీను వైట్ల ప్రేక్షకులను తక్కువ అంచనా వేసిన ఫలితం అన్నది అందరికీ అర్థమైపోయింది. తీసిన సినిమాను మళ్లీ తీసేస్తే జనం కాసులు కురిపించి, కళ్లు అప్పగించి చూసేస్తారనుకున్నాడు. ఇక కొత్త దర్శకుడు బాబి తోలిసారి చేస్తున్నపుడు కాస్తయినా కోత్తదనం ప్రదర్శించాలన్నది మరిచిపోయి, రవితేజ తో రోటీన్ సినిమా తీసి అందించాడు. అయితే రవితేజ మార్కు ఎంటర్ టైన్ మెంట్ వుండడం, వినాయక్ మార్క్ మాస్ యాక్షన్ కనిపించడం సినిమాకు కాస్త ప్లస్ అయింది. 

ఇక మిగిలింది కృష్ణవంశీ. సీనియర్ దర్శకుడు. తన దైన స్టయిల్ వున్నవాడు. ఏం చేస్తాడో అన్నది వేచి చూడాలి. ఆయన అప్ డేట్ అయి, టేకింగ్ ఆయన స్టయిల్ లో వున్నా, కథ, కథనాల్లో కాస్త వైవిధ్యం ప్రదర్శిస్తే సినిమా గట్టక్కేస్తుంది. అలా కాకుండా మురారి, కలిసుందాంరా, సీతారామయ్య గారి మనవరాలు మాదిరి కథలు కలిపి రుబ్బితే మాత్రం జనాలు అంగీకరించరు. 

ఈ వైనం తేలాలంటే మరో తొమ్మిది రోజులు ఆగాలి. అప్పుడు గానీ ఈ సీజన్ హీరో ఎవరు అన్నది తేలదు. బడ్జెట్ పక్కన పెట్టి కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఇప్పటికి మహేష్ బాబే ముందంజలో వున్నాడు. సినిమా టాక్ ఎలా వున్నా వసూళ్లు, జనాల క్రేజ్ ఆ రేంజ్ లో వున్నాయి కాబట్టి. దీన్నిరామ్ చరణ్ దాటగలడా? చూడాలి మరి.

'చిత్ర'గుప్త

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?