‘ఆగడు’ఖర్చు సీక్రెట్ అదేనా?

ఆగడు సినిమా చూస్తే భారీతనం మచ్చుకు కనిపించదు. కానీ ఖర్చు మాత్రం 60 కోట్లకు పైగా అయిందని నిర్మాతలు చెబుతున్నారు. గడచిన సినిమాల లాస్ కవరింగ్ కోసం ఇలా అని ఓ టాక్ వుండనే…

ఆగడు సినిమా చూస్తే భారీతనం మచ్చుకు కనిపించదు. కానీ ఖర్చు మాత్రం 60 కోట్లకు పైగా అయిందని నిర్మాతలు చెబుతున్నారు. గడచిన సినిమాల లాస్ కవరింగ్ కోసం ఇలా అని ఓ టాక్ వుండనే వుంది. కానీ అది కాక అసలు సంగతి వేరే వుందని ఇప్పడు వినిపిస్తున్న తాజా వార్త. ఈ సినిమాకు హీరో కన్నా కాస్త తక్కువగా శ్రీను వైట్ల 10 నుంచి 12 కోట్ల మధ్య పారితోషికం తీసుకున్నాడట. 

కానీ అది కాదు మాటర్..సినిమా మొత్తం ప్రొడక్షన్ వ్యవహారాలు అతగాడే చూసుకున్నాడట. నిర్మాతలు చెక్కులు రాయడం, క్యాష్ ఇవ్వడం మినహా మరేవీ పట్టించుకోలేదని వినికిడి. దాంతో చెప్పింది ఖర్చు, ఇచ్చింది పేమెంట్ అన్నట్లు సాగిపోయిందని అంటున్నారు. అన్నట్లు శ్రీను వైట్ల ఇప్పడు టాలీవుడ్ లో బాగా 'డబ్బు'చేసిన డైరక్టర్లలో ఒకరట. దూకుడు, బాద్ షా, ఆగడు ఈ మూడు సినిమాలతోనే ముఫై కోట్ల వరకు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నారట. పైగా అడ్వాన్సులు బాగానే వున్నాయట. పోనీ నిర్మాతలు ఎలా పోయినా, దర్శకులు అయినా బాగు పడుతున్నారు.