ఫ్లాపులు వచ్చినా థమన్ ‘ఆగడు’

ఎస్..ఎస్..థమన్..దురభిమానులు ముద్దుగా సేమ్ టు సేమ్ ట్యూన్ల థమన్ అంటారు. రభస, పవర్, ఆగడు..వరుసగా మూడు అట్టర్ ఫ్లాప్ అడియోలు. ఆవే కాదు, వాటికి ముందు అనేకానేకం. అయినా మన హీరోలకు ఎందుకో అతగాడే…

ఎస్..ఎస్..థమన్..దురభిమానులు ముద్దుగా సేమ్ టు సేమ్ ట్యూన్ల థమన్ అంటారు. రభస, పవర్, ఆగడు..వరుసగా మూడు అట్టర్ ఫ్లాప్ అడియోలు. ఆవే కాదు, వాటికి ముందు అనేకానేకం. అయినా మన హీరోలకు ఎందుకో అతగాడే కావాలి. రభసకు అనూప్ రూబెన్స్ ను పెట్టుకుంటే ఎన్టీఆర్ పట్టుపట్టి థమన్ ను తీసుకవచ్చాడు. ఏమయింది..ఇంటికెళ్లింది. 

హీరోల చేత పాటలు పాడించి వాళ్ల గుడ్ లుక్స్ వుండడంలో పెట్టే శ్రద్ధ ట్యూన్ల మీద పెడితే మంచి ట్యూన్లు వస్తాయని అభిమానుల సలహా. అనూప్ చేసిన సినిమాలన్నీ ఇటు కమర్షియల్ గానూ, అటు ట్యూన్ల పరంగానూ హిట్టే. మనం లాంటి ప్రెస్టీజియస్ మూవీకి సంగీతం అద్భతంగా అందించాడు. కానీ మన మాస్ హీరోల కంటికి ఆనడు. అయితే దేవీ, లేకుంటే థమన్. ఇలా ఎన్నాళ్లు ఆగకుండా ఫ్లాపులు ఇచ్చుకుంటూ వెళ్తారో మరి చూడాలి.