ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్లంతా పెద్ద స్టార్లు. సినిమా హిట్ అయితే భయంకరంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్లాప్ అయితే చాలు మరి మాట వినపడదు. సినిమాను కాస్త ఖుషామత్ చేసి లేపుదాం..నిర్మాతకు సాయం పడదాం అని మాత్రం అనుకోరు. అసలు సినిమా ప్రచారానికే వీళ్లు ముందుకు రారు.
మహా తప్పదు అనుకుంటే మాంచి ఏంకర్ ను ఎంచుకుని వారు అనుకున్న రీతిలో ఇంటర్వూ చేయించుకుని, దాన్ని విడుదల చేస్తారు తప్ప మీడియా ముందుకు రారు. నాగ్, వెంకీ లాంటి సీనియర్లు అలా కాదు. సినిమా విడుదల ముందు నుంచి, తరువాత వరకు విపరీతంగా కష్టపడి ఇంటర్వూలు, చిట్ చాట్ లు, ఇలా అన్నింటిలో పాల్గొంటారు.
పవన్ సినిమాలు హిట్ అయనా, ఫట్ అయినా కనిపించరు. అత్తారింటికి దారేది కి మాత్రం త్రివిక్రమ్ తో కలిసి కాస్త ఓ కార్యక్రమం చేసాం అనిపించుకున్నారు. రభస ఫ్లాప్ అయింది. కనీసం ఎన్టీఆర్ తన పాత్ర ఏమేరకు, అసలు తరువాత ఏంటి అన్నది అభిమానులను ఊరడించడానికైనా మాట్లాడాలా..అబ్బే అదీం వుండదు. ఇక మహేష్ సంగతి చెప్పనక్కరేలేదు. ఇలా అయితే కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతల సంగతేమిటి?