సరైనోడు చిత్రంలో యంగ్ ఎమ్మెల్యేగా కనిపించి మురిపించిన కేథరీన్ మరోసారి రాజకీయ నాయకురాలి పాత్ర పోషించనుంది. తేజ డైరెక్ట్ చేయబోతున్న తదుపరి చిత్రంలో కేథరీన్ది పొలిటీషియన్ క్యారెక్టర్ అని తెలిసింది. సరైనోడు సినిమా చూడడం వలనేనేమో ఆ పాత్రకి కేథరీన్ అయితే కరక్ట్ అని తేజ భావించినట్టున్నాడు.
రానా, కాజల్ జంటగా నటించే ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ అట. బాహుబలికి రానా పని అయిపోగానే ఈ చిత్రం సెట్స్ మీదకి వెళుతుంది. ఇక కేథరీన్ విషయానికి వస్తే ఆమె ఇటీవలే ఖైదీ నంబర్ 150 చిత్రంలో పాట చేసే అవకాశాన్ని మిస్ చేసుకుంది.
డాన్స్ మాస్టర్ లారెన్స్‌తో జరిగిన గొడవ కారణంగా కేథరీన్‌ని తీసేసారని సమాచారం. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ అరకొర అవకాశాలే వస్తోన్న కేథరీన్ ఇలా వచ్చిన ఛాన్స్‌లు కూడా పోగొట్టుకోవడం ఏమిటో మరి. ఆమెకి ఉన్న ఆటిట్యూడ్ ప్రాబ్లమ్ వల్లే ఎక్కువ ఆఫర్లు రావడం లేదనే టాక్ కూడా ఉంది. ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలంటే అందంతో పాటు కాస్త లౌక్యం కూడా ఉండాలి మరి.