చిరంజీవి ఫాన్స్‌కే నచ్చట్లేదు

'బిజినెస్‌ చేసుకోవడానికి సినిమా తీస్తున్నారా లేక సక్సెస్‌ కోసం చేస్తున్నారా?' అంటూ ఖైదీ నంబర్‌ 150 గురించి అభిమానులే మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని అన్ని చోట్లా భారీ రేట్లకి అమ్ముతూ ఉండడం ఫాన్స్‌కి నచ్చడం…

'బిజినెస్‌ చేసుకోవడానికి సినిమా తీస్తున్నారా లేక సక్సెస్‌ కోసం చేస్తున్నారా?' అంటూ ఖైదీ నంబర్‌ 150 గురించి అభిమానులే మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని అన్ని చోట్లా భారీ రేట్లకి అమ్ముతూ ఉండడం ఫాన్స్‌కి నచ్చడం లేదు. సొంతంగా విడుదల చేసుకున్నట్టయితే సక్సెస్‌ అవకాశాలు ఎక్కువ. 

అదే ఇలా అడిగినంతకి ఇచ్చేస్తూ పోతే, సినిమా ఏమాత్రం అటు ఇటు అయినా బయ్యర్లు నష్టపోతారు. ఫ్లాప్‌ వస్తుందనే భయం కంటే, చిరంజీవిని జనం పూర్తిగా రిజెక్ట్‌ చేసేసారు అంటూ మీడియా రెచ్చిపోతుందనే భయమే ఫాన్స్‌ని వేదిస్తోంది. యువ హీరోల సినిమాలకి పోటీగా రేట్లు పెట్టి ఈ చిత్రాన్ని అమ్మడం ద్వారా చిరు స్టామినా చూపిస్తున్నామని మేకర్స్‌ భావిస్తూ ఉండొచ్చు. 

కానీ ఈ స్ట్రాటజీ వల్ల ఫలితం అనుకున్నట్టుగా రాకపోతే ప్రమాదం భారీ స్థాయిలో ఉంటుంది. అసలే ఈ చిత్రంతో పోటీగా బాలకృష్ణ వందవ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' రిలీజ్‌ అవుతుండడంతో ఫాన్స్‌కి పరువు ప్రతిష్టలకి సవాల్‌గా మారింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమాని హిట్‌ చేయడం మీద దృష్టి పెట్టి ఉండాల్సిందని ఫాన్స్‌ అనుకుంటున్నారు. అయితే వారి భయాలకి అతీతంగా చిరంజీవి ఈ ఏజ్‌లోను అరవై, డెబ్బయ్‌ కోట్ల విజయం సాధిస్తే ఆ కిక్కే వేరనుకోండి.