భార్య టాలెంట్ మీద భర్తకి ఎంత నమ్మకమో.! అందుకే తన భార్య టాలెంట్ వృధా కాకూడదనీ, ఆమె తిరిగి సినిమాల్లో రెగ్యులర్‌గా నటించాలనీ, అందుకు భర్తగా తనవంతు ప్రోత్సాహం అందిస్తూనే వుంటానని తమిళ హీరో సూర్య, తన భార్య జ్యోతిక గురించి చెప్పుకొచ్చాడు.
'36 వయదనిలే' అనే సినిమాతో జ్యోతిక సినిమాల్లోకీ రీ-ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో జ్యోతిక నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందేనని సూర్య చెబుతున్నాడు. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి, హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిక, సూర్యను పెళ్ళాడాక సినిమాలకు దూరమైన విషయం విదితమే.
ఓ మలయాళ సినిమాకి తమిళ రీమేక్ అయిన '36 వయదనిలే' సినిమాతో రీ-ఎంట్రీకి రెడీ అయిన జ్యోతిక తొలుత ఈ సినిమాని తన సొంత దర్శకత్వంలో చేయాలనుకుంది. కానీ, చివరి నిమిషంలో జ్యోతిక మనసు మార్చుకుంది. ఇదిలా వుటే, జ్యోతిక రీ-ఎంట్రీతో తెలుగులోనూ ఆమెకు అవకాశాలు పోటెత్తడం ఖాయంమంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు కొందరు.