ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచ క్రికెట్ ప్రస్థానంలోనే మేలి మలుపు. ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ ల స్ఫూర్తితో ఇండియాలో క్రికెట్ కు క్రేజుతో బీసీసీఐ రూపొందించిన ఈ లీగ్ అనేక రకాలుగా సంచలనం. ఇలాంటి లీగ్ చూస్తుండగానే ఏడు సీజన్లను పూర్తి చేసుకొంది. ఎనిమిదో సీజన్ మొదలవుతోంది.
ఇప్పుడే కాదు..దాదాపు మూడు సీజన్ల నుంచి తెలుగువారికి ఈ లీగ్ విషయంలో ఒక సంకటం! ఈ లీగ్ ఆడుతున్న జట్లలో మనం దేన్ని నెత్తికెత్తుకోవాలి.. దేన్ని ఓన్ చేసుకోవాలి… దేనికి మద్దతు పలకాలి? ఏ జట్టు గెలవాలని పూజలు చేయాలి? అనేది తెలుగు వాళ్లకు ఉన్న పెద్ద డౌట్!
న్యాయంగా చెప్పాలంటే హైదరాబాద్ బేస్డ్ ప్రాంచైజ్ అయిన సన్ రైజర్స్ జట్టుకు మనం సపోర్ట్ చేయాలి. ఆ జట్టు పేరుతో హైదరాబాద్ ను పెట్టుకొంది కాబట్టి… మనం సపోర్టు చేయాలంతే! అయితే.. పేరుకు మాత్రమే హైదరాబాద్… ఆ జట్టులో తెలుగు దనం ఏ కోశానా కనపడదు!
జట్టు ఓనర్లలు సాంబార్ గాళ్లు… సన్ టీవీ యజమానులు. కెప్టెన్ విదేశీయుడు, నేషనల్ టీమ్ కు ఆడే సత్తా ఉన్న తెలుగు, హైదరాబాద్ బేస్డ్ ప్లేయర్లు ఎవరూ ఈ జట్టు లో లేరు. ఓజా, రాయుడు వంటి వాళ్లు ఈ హైదరాబాద్ బేస్డ్ జట్టుకు ఆడటం లేదు. కనీసం ఒక్క తెలుగు ఆటగాడు ఈ జట్టు తరపున మైదానంలోకి దిగుతాడా? లేదా.. ? అనేది పెద్ద సందేహం. జట్టు మెంటర్ గా వీవీఎస్ కు చిన్నగా చోటు కల్పించడమే.. ఈ జట్టులోని తెలుగుదనం!
సన్ రైజర్స్ ఉదయించక పూర్వం హైదరాబాద్ కు పక్కా తెలుగు ఓనర్లు ఉండే వాళ్లు.. డీసీ యజమాన్యం తిక్కవరపు ఫ్యామిలీ ఆధ్వర్యంలో డెక్కన్ చార్జర్స్ టీమ్ ఉండేది. అప్పట్లో జట్టులో చాలా తెలుగు మొహాలు ఉండేవి. విజయ్ కుమార్, తిరుమల శెట్టి సుమన్ వంటి వాళ్ల దగ్గర నుంచి చాలా మంది ఏపీ రంజీ ప్లేయర్లు చార్జర్స్ తో పాట ఉండే వాళ్లు.
అయితే ఇప్పుడు యాజమాన్యపు హక్కులు కూడా తమిళుల చేతిలోకి వెళ్లిపోవడంతో.. చాలా వరకూ హైదరాబాద్ జట్టును తెలుగు వాళ్లు ఓన్ చేసుకోవడం మానేస్తున్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అయితే చెన్నైకి ప్రాతినిధ్యం వహించే జట్టును అమితంగా అభిమానిస్తారు. ఎందుకంటే.. వాటి యజమానులు తమిళులు, ఆట విషయంలో కూడా తమిళులకు ఛాన్స్ ఇస్తారు! రెండు రాష్ట్రాలున్న తెలుగు వాళ్లకే ఇప్పుడు ఆ అవకాశం లేదు!