ఆమెకు యాభై..ఈమెకు కోటి

కరోనా టైమ్ లో సినిమాల పరిస్థితి పెద్దగా బాలేకపోయినా, హీరోయిన్ల రేట్లు మాత్రం బాగానే పెరుగుతున్నాయి. హిట్ ల ట్రాక్ లో వున్న హీరోయిన్లు రేట్లు పెంచారంటే ఓ రీజన్ వుంది అనుకోవచ్చు. కానీ…

కరోనా టైమ్ లో సినిమాల పరిస్థితి పెద్దగా బాలేకపోయినా, హీరోయిన్ల రేట్లు మాత్రం బాగానే పెరుగుతున్నాయి. హిట్ ల ట్రాక్ లో వున్న హీరోయిన్లు రేట్లు పెంచారంటే ఓ రీజన్ వుంది అనుకోవచ్చు. కానీ పెద్దగా హిట్ లు లేని హీరోయిన్లు కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు.

ప్రతి రోజూ పండగే సినిమా తరువాత రాశీఖన్నా తెలుగులో గోపీచంద్ పక్కా కమర్షియల్, నాగ్ చైతన్య థాంక్యూ సినిమాల్లోనటిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలో మూడు, మలయాళంలో ఒకటి చేస్తోంది. అందుకే కోటి రూపాయలకు తగ్గేదే లే అంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ పండగే సినిమాకు 75 లక్షలు పారితోషికం తీసుకున్న రాశీ ఇప్పుడు కోటి డిమాండ్ చేస్తోందట.

ఇక పెద్దగా సినిమాలు లేని మెహరిన్ కూడా యాభై లక్షలకు తగ్గనంటోందట. ఎఫ్3 తరువాత మారుతి దర్శకత్వ పర్యవేక్షణలోని చిన్న సినిమాలో నటించడానికి యాభై లక్షలు డిమాండ్ చేసినట్లు బోగట్టా. ఆఖరికి 40 కో 45 లక్షలకో సెటిల్ చేసారని తెలుస్తోంది.