శేఖర్ కమ్ముల ఎంత ఫాస్ట్ గా సినిమాలు తీస్తాడో చిన్న పిల్లాడ్ని అడిగినా చెబుతాడు. ఫ్రేములకు ఫ్రేములు చెక్కడం, తీసిన సన్నివేశాల్నే ఫర్ ఫెక్షన్ కోసం మళ్లీ మళ్లీ తీయడం కమ్ములకు వెన్నతో పెట్టి విద్య. ఈ దర్శకుడు ఏళ్లకు ఏళ్లు, రీళ్లకు రీళ్లు తీస్తూనే ఉంటాడు. ఇలాంటి దర్శకుడ్ని పట్టుకొని కమ్ముల చాలా ఫాస్ట్ అంటున్నాడు ఓ హీరో అతడు మరెవరో కాదు వరుణ్ తేజ.
సినిమా మేకింగ్ లో కమ్ములకు చాలా క్లారిటీ ఉందంటున్నాడు వరుణ్ తేజ. కొంతమంది ఈ విషయాన్ని కూడా ఒప్పుకోకపోయినా.. ఇక్కడ మనం కన్విన్స్ అవుదాం. కానీ శేఖర్ కమ్ముల చాలా ఫాస్ట్ గా షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తాడంటూ వరుణ్ తేజ చెప్పడం మాత్రం కూసింత విడ్డూరంగానే ఉంది. మొదటి సినిమా ఆనంద్ నుంచి మొన్నటి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వరకు కమ్ముల తీసిన అన్ని సినిమాలూ ఏళ్లకు ఏళ్లు సాగినవే.
అలాంటి దర్శకుడితో ప్రస్తుతం ఫిదా అనే సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోందని అంటున్నాడు. అంతేకాదు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే మరో 20-25 రోజుల్లో ఫిదా షూటింగ్ అయిపోతుందట. వరుణ్ తేజ అబద్ధం చెబుతున్నాడా లేక కమ్ముల మారిపోయాడా లెట్స్ వెయిట్ అండ్ సీ.