రక్షకభటుడు ఎవరు?

ఈ మధ్య రక్షకభటుడు అనే సినిమా ఒకటి సినిమా ప్రకటనల్లో కనిపిస్తోంది. ఎప్పుడు తీసారో, ఎప్పుడు ఫినిష్ చేసారో తెలియదు, సడెన్ గా ప్రత్యక్షమయింది. జక్కన్నతో హిట్ సినిమా ఇచ్చా అనిపించుకున్న దర్శకుడు వంశీకృష్ణ…

ఈ మధ్య రక్షకభటుడు అనే సినిమా ఒకటి సినిమా ప్రకటనల్లో కనిపిస్తోంది. ఎప్పుడు తీసారో, ఎప్పుడు ఫినిష్ చేసారో తెలియదు, సడెన్ గా ప్రత్యక్షమయింది. జక్కన్నతో హిట్ సినిమా ఇచ్చా అనిపించుకున్న దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకు దర్శకుడు. అయితే పోస్టర్లు అన్నింటిలో పోలీస్ డ్రెస్ వేసుకున్న ఆంజనేయస్వామి పిక్చర్ తప్ప మరోటి కనిపించడం లేదు.

నిర్మాతలు కూడా కాస్టింగ్ ఏమిటన్నది ఇంతవరకు వెల్లడించ లేదు. అదేంటీ సంగతి అని విచారిస్తే, తమ సినిమా కాస్టింగ్ ఏమిటన్నది ఇప్పట్లో వెల్లడించే ఉద్దేశంలో యూనిట్ లేదని తెలుస్తోంది. సినిమాను మే 5 విడుదల చేస్తారు. అప్పుడే ఈ విషయం వెల్లడవుతుందట. సినిమాలో హీరో ఎవరు అన్న సంగతి అలా వుంచితే, ఆంజనేయ స్వామిగా ఓ పాపులర్ హీరోనే కనిపిస్తాడని మరో టాక్. 

ఆ పాత్ర నిడివి జస్ట్ నిమషాలే వుంటుంది కానీ, అది ఓ పాపులర్ హీరోనే చేసారని తెలుస్తోంది. ఆ విషయం కూడా ఇప్పట్లో రివీల్ చేయరట. ఇదేదో కొత్త తరహా పబ్లిసిటీలా వుంది.