ఆ టైపు సినిమాలకు 20 లక్షలు ఎక్స్ ట్రా పేమెంట్

హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుందామని ప్రయత్నించి, తనకు తెలియకుండానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది. అడపాదడపా లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. క్రేజ్ మాత్రం ఆమెకు అందని ద్రాక్షే అయింది.  Advertisement ఈ క్రమంలో…

హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుందామని ప్రయత్నించి, తనకు తెలియకుండానే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది. అడపాదడపా లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ.. క్రేజ్ మాత్రం ఆమెకు అందని ద్రాక్షే అయింది. 

ఈ క్రమంలో బుల్లితెర వైపు కూడా అడుగులు వేసింది ఆ హీరోయిన్. ఓవైపు టీవీ కార్యక్రమాలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడీ హీరోయిన్ కు సంబంధించి ఓ కొంటె కోణం బయటకొచ్చింది.

ఈమధ్య కాస్త శృంగారభరిత సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ నటి. అయితే ఇక్కడ కండిషన్స్ అప్లయ్. మామూలు సినిమాలకు ఇచ్చే పారితోషికం ఇలాంటి సినిమాలకు వర్తించదు. అదనంగా 20 లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే ఆ టైపు  సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది ఈ అమ్మడు.

కేవలం ఆ టైపు సినిమాలకే కాదు, ఆ టైపు సీన్లలో కూడా నటించడానికి ఎక్స్ ట్రా డిమాండ్ చేస్తోంది ఈమె. అటు నిర్మాతలు కూడా ఈ ఆఫర్ తో హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే, అంతోఇంతో పేరు తెచ్చుకున్న హీరోయిన్లు ఎవరూ ఇలా బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 

ఎక్స్ ట్రా 20 లక్షలు ఇచ్చుకుంటే, ఈమె రెడీ అంటోంది. పైగా హోమ్లీ లుక్స్ తో బోల్డ్ గా కనిపించే ఫేస్ ఆమెది.

పెద్దగా క్రేజ్ లేకపోయినా, క్యాష్ కు మాత్రం ఢోకా లేకుండా సాగిపోతోంది ఆమె కెరీర్. 3 టీవీ షోలు, 6 సినిమాలుగా కళకళలాడుతోంది. క్రేజ్ తగ్గిన హీరోయిన్లు పరభాషా చిత్రాల వైపు మళ్లుతున్న ట్రెండ్ కు భిన్నంగా.. ఈ బొద్దుగుమ్మ ఇలా తనకంటూ ఓ అవకాశాల ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఎప్పటికప్పుడు పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తూ, కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది.