Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అదే కాంబినేషన్ లో మరో సినిమా

అదే కాంబినేషన్ లో మరో సినిమా

దర్శకుడు వంశీ పైడిపల్లితో నిర్మాత పివిపికి రెండో సినిమా మహర్షి. మొదటి సినిమా ఊపిరి. రెండో సినిమాకు ఇద్దరు పార్టనర్లు అదనంగా కలిసారు. ఇప్పుడు మళ్లీ ఇధే కాంబినేషన్ లో మరో సినిమా వుంటుందని తెలుస్తోంది. అంటే దిల్ రాజు, పివిపి, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మరో సినిమా వుంటుందట. మహర్షి సినిమా డీల్ సెట్ అయినపుడే ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

ఇందుకోసం అప్పుడే నిర్మాతలు వంశీ పైడిపల్లికి భారీ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడుకోట్ల అడ్వాన్స్ ను వంశీపైడిపల్లికి ఇచ్చారని వినికిడి. మరి మహర్షికి మంచి అప్లాజ్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ మహేష్ నే సినిమా చేస్తాడా? లేక వేరే హీరోతో సినిమా వుంటుందా అన్నది టూ ఎర్లీ క్వశ్చను.

వంశీ పైడిపల్లి తయారుచేసే స్క్రిప్ట్ ను బట్టి వుంటుంది. హీరో సంగతి పక్కన పెడితే, నిర్మాతలు-డైరక్టర్ కాంబినేషన్ మాత్రం పక్కా.

జమ్మలమడుగులో కాయ్ రాజా కాయ్.. ఓన్లీ మెజారిటీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?