Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆపద్భాంధవుడు అంబానీయేనా?

ఆపద్భాంధవుడు అంబానీయేనా?

ముఖేష్ అంబానీ గురించి కొత్తగా చెప్పడమో, వివరించడమో అనవసరం. ఈనాడు రామోజీరావు దాదాపు కార్నర్ లోకి వెళ్లిపోయిన సందర్భంలో, అందరూ ఇక అంతా అయిపోయింది అనుకున్న టైమ్ లో సీన్ లోకి ఎంటరై, ఆయనను బెయిలవుట్ చేసింది అంబానీనే. ఆయన సంస్థ ఈనాడులో ఏదో విధంగా పెట్టుబడులు పెట్టి, వేలకోట్లు అప్పటికప్పుడు రామోజీకి సర్దుబాటు అయ్యేలా చేసింది. మార్గదర్శి వివాదం నుంచి ఆయనను గట్టెక్కించింది.

ముఖేష్ అంబానీతో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పూర్తి సత్సంబంధాలు వున్నాయి. ఎంతలా అంటే, ఈస్ట్ గోదావరి నుంచి గ్యాస్ ను గుజరాత్ కు తీసుకెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం రాకపోవడమే కాదు, ఆ సంస్థకు ఓ కీలక అధికారిని నియమించే విషయంలో చంధ్రబాబు మాటే అంబానీ శిరసావహించారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. తెలుగుదేశంతో, చంద్రబాబుతో మంచి సంబంధాలు వున్న రామోజీని ఆ విధంగా అప్పట్లో అంబానీ గట్టెక్కించారు.

ఇప్పుడు మరోసారి అదే తెలుగుదేశంతో సత్సంబంధాలు వున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ ను కూడా అంబానీ గట్టెక్కిస్తారని గుసగుసలు వినిపించడం ప్రారంభమైంది. రవిప్రకాష్ తలుచుకుంటే ఏదో ఛానెల్ స్టార్ట్ చేయడం లేదా, కొనడం ఇలాంటివి ఏవీ పెద్ద విషయాలు కాదు.

కానీ అలా కాకుండా జాతీయస్థాయిలో పేరున్న నెట్ వర్క్, కాస్త భారీగా పెట్టుబడులు పెట్టగల సంస్థ అయితే ఆ మజానే వేరు. రాష్ట్రవ్యాప్తంగా మంచి నెట్ వర్క్ తయారుచేయడం, అలాగే మళ్లీ తన స్టయిల్, తమసత్తా చాటడం వంటివి జరగాలి అంటే అంబానీ లాంటివాళ్ల అండదండలు అవసరం. అందువల్ల ఆ మేరకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఇప్పటికే వార్తలు గుప్పుమన్నాయి.

కానీ ఒకటే సందేహం. అంబానీ లాంటి రాజకీయవేత్త, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూసి గానీ నిర్ణయం తీసుకోరు. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే, వాళ్లని కాదని ఆయన ఇలాంటి నిర్ణయం పొరపాటున కూడా తీసుకోరు. అందువల్ల ఈ గ్యాసిప్ లు నిజం అవుతాయా? కావా? అన్నది చూడాలంటే 23వ తేదీ దాటాలి.

ఏమైనా తెలుగుదేశం పార్టీ సంబంధీకులు కష్టాల్లో పడినప్పుడల్లా ఆదుకునే పేర్లలో అంబానీ పేరే వినిపించడం కాస్త ఆలోచించదగ్గ విషయమే.

జమ్మలమడుగులో కాయ్ రాజా కాయ్.. ఓన్లీ మెజారిటీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?