సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ఫుల్ జోష్ మీద, ఫుల్ ఖుషీ మీద వున్నారు. నిర్మాతలు ఇప్పుడు ఎలా పబ్లిసిటీ ప్లాన్ చేస్తే, అలా ఓకె అంటున్నారు. సినిమా పోస్ట్ పబ్లిసిటీ కోసం మహేష్ ముందుగా అనుకున్న ఫ్యామిలీ విదేశీ టూర్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు కూడా డిఫరెంట్ స్ట్రాటజీ పాటిస్తున్నారు. సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే అదృష్టం ఏమిటంటే ఎవ్వరూ సినిమా బాగుందా లేదా అనే దానికన్నా నిడివి ఎక్కువ అన్నదానిపైనే మాట్లాడారు.
దాంతో దిల్ రాజు అసలు ఆ వైనమే మరచిపోయేలా ప్లాన్ చేసారు. విడుదలయిన రోజు రాత్రే అందరూ భారీ పార్టీ చేసుకుని ఆ ఫోటోలు బయటకు వదిలారు. అలాగే విడులయిన మర్నాడే మాంచి సక్సెస్ మీట్ చేసారు. అదేరోజు మళ్లీ మహేష్ ఇంట పార్టీ జరిగింది. ఆ తరువాత మళ్లీ భారీ సక్సెస్ మీట్ చేసారు. మహేష్ తొలిసారి కాస్త హడావుడి చేసారు. కాలర్ ఎగరేసారు. దర్శకుడికి ముద్దు ఇచ్చారు. దర్శకుడి ఫ్యామిలీ, మహేష్ ఫ్యామిలీ క్లోజ్ పిక్చర్లు విడుదల చేసారు.
ఇప్పుడు ఇంకా అనేక కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకటి థియేటర్లను టచ్ చేయడం. మహేష్ స్వయంగా ఒకటి రెండు థియేటర్లు విజిట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ లాంటి సూపర్ స్టార్ థియేటర్ విజిట్ చేయడం చాలా అరుదు. ఈ మేరకు సస్పెన్స్ గా బుధవారం ఏదో ఒకటి లేదా రెండు థియేటర్ల విజిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దాని తరువాత రైతులతో చిన్న మీట్ ఒకటి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ మీట్ లో పాల్గొంటారు. ముందుగానే అనుకున్న ప్రకారం 18న విజయవాటలో భారీ సక్సెస్ మీట్ వుంటుంది. దానికి పాతికమంది దర్శకులు, నిర్మాతలు హాజరవుతారు.
మొత్తంమీద ఈ హడావుడి అంతాకలిసి, మహర్షిపై వచ్చిన మిక్స్ డ్ టాక్ ను మరిచిపోయేలా చేసాయి. ఇప్పుడు జనాల దృష్టి మహర్షి ఓసారి చూడాలి అనిపించేలా మార్చాయి.