Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వెంకీ మళ్లీ వచ్చాడు.. ఇది కూడా హిట్ అవుద్దా?

ఇండస్ట్రీ జనాలకు వెంకటేష్ ఇప్పుడు సెంటిమెంట్ అయిపోయాడు. ఏదైనా మూవీ ఫంక్షన్ కు వెంకీ వస్తే ఆ సినిమా హిట్ అనే టాక్ బాగా నాటుకుపోయింది. ఈ సమ్మర్ లో రిలీజైన మజిలీ, జెర్సీ, మహర్షి సినిమా ఫంక్షన్లకు వెంకటేష్ హాజరయ్యాడు. ఆ మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడిదే సెంటిమెంట్ తో మరో సినిమా వస్తోంది.

అన్ని తానై విశ్వక్ సేన్ తీసిన సినిమా ఫలక్ నుమా దాస్. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు ఈ మూవీని డైరక్ట్ చేసింది కూడా ఇతడే. ఇప్పుడీ సినిమా ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ కు వెంకీ ప్రత్యేక అతిథిగా వచ్చాడు. గతంలో వచ్చిన ఫలక్ నుమా దాస్ టీజర్ లో డైలాగ్స్ చెప్పి అందర్లో హుషారు నింపాడు. వెంకీ రాకతో యూనిట్ మొత్తం ఫుల్ ఫిదా అయిపోయింది.

మొన్నటివరకు వెంకీ హాజరైన సినిమాలపై అప్పటికే అంచనాలున్నాయి. మజిలీ అయినా, మహర్షి అయినా అవి పెద్ద సినిమాలు. ఆడియన్స్ ఎదురుచూసిన మూవీస్. అలాంటి సినిమాల ఫంక్షన్లకు వెంకీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. తర్వాత అవి హిట్ అయ్యాయి. కానీ ఫలక్ నుమా దాస్ సినిమా మాత్రం అలాంటిది కాదు.

సింపుల్ గా చెప్పాలంటే ఇదొక చిన్న సినిమా. చెప్పుకోదగ్గ స్టార్స్ ఎవరూ లేరిందులే. వెళ్లిపోమాకే, ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాల్లో నటించిన విశ్వక్ సేన్ కూడా పెద్దగా పాపులర్ కాదు. ఇలాంటి సినిమా కూడా హిట్ అయితే కచ్చితంగా వెంకటేష్ లక్కీ హ్యాండ్ గా మారిపోతాడు. అప్పుడు అతడితో సినిమాలు చేసేకంటే, ఇలాంటి ఫంక్షన్లకు తీసుకురావడానికే ఎక్కువ ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

జమ్మలమడుగులో కాయ్ రాజా కాయ్.. ఓన్లీ మెజారిటీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?