ఇది మహేశ్ అభిమానులు గర్వంగా ఫీలయ్యే వ్యవహారం. వారి అభిమాన హీరో స్టామినాకు ఇదొక నిదర్శనం. ఆ హీరో కెరీర్ లో ఇటీవలే దక్కిన మెమొరబుల్ హిట్ 'శ్రీమంతుడు' కు సంబంధించిన వార్త ఇది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో మొన్నటి వరకూ కొత్త కొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. వందరోజులకు సమీపంలో ఉన్న ఈ సినిమా ఇటీవలే టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యింది.
ఆదివారం రోజున ఒక చానల్ వారు ఈ సినిమాను ప్రసారం చేశారు. భారీ మొత్తానికి శాటిలైట్ రైట్స్ కొనుక్కొన్న ఆ చానల్ వారు 'శ్రీమంతుడు' ప్రసారంతో టీఆర్పీలో మరో అడుగుకు ముందుకు వేశారు! మిగిలిన్న చానళ్లన్నింటినీ తలదన్ని పై ఒక వారంలో స్థానంలో నిలిచారు. ఇలా మహేశ్ సినిమాను కొనుగోలు చేసిన చానల్ ఆ విధంగా హ్యాపీ నెస్ ను మిగుల్చుకోగా.. టీవీలో ప్రసారం అవుతూ కూడా మహేశ్ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది!
సాధారణంగా టాప్ హీరోల సినిమాల విడుదల అవుతూ ఫేస్ బుక్ ట్రెండింగ్స్ లో ముందుంటాయి. సమాజంలో సంభవిస్తున్న ఇతర సంఘటనలన్నింటినీ అధిగమిస్తూ.. ఎక్కువమంది చేత చర్చింపడుతూ ఆ సినిమాటు ఫేస్ బుక్ ట్రెండింగ్స్ లో టాప్ పొజిషన్లో నిలుస్తుంటాయి.
మరి ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే.. మహేశ్ సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతూ కూడా ఆదివారం రోజున ఫేస్ బుక్ లో టాప్ ట్రెండింగ్ సబ్జెక్టుగా నిలిచింది. ఎంతోమంది శ్రీమంతుడు గురించి ఈ ఆదివారం రోజున మాట్లాడుకోవడంతోనే ఆ సినిమా ఈ విధంగా సోషల్ ట్రెండింగ్ లో ముందు నిలిచింది. మరి విడుదల అయిన సమయంలోనే కాకుండా.. ఇలా టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతూ కూడా 'శ్రీమంతుడు' మహేశ్ సత్తాకు నిరూపణగా నిలిచింది!