సోనమ్ కపూర్ స్టేట్ మెంట్ తో తెలుగు హీరో గేమ్..!

హర్షవర్ధన్ రాణే.. గుర్తున్నాడా.. ఈ మధ్య కాలంలో ఇతడు ఏ సినిమాలోనూ కనిపించకపోవడంతో ఇలా మొదలుపెట్టాల్సి వస్తోంది. తెలుగులో నెగిటివ్ టచ్ ఉన్న, చోటా హీరో పాత్రలు చేస్తూ… కొంత గుర్తింపును సంపాదించుకున్న ఈ…

హర్షవర్ధన్ రాణే.. గుర్తున్నాడా.. ఈ మధ్య కాలంలో ఇతడు ఏ సినిమాలోనూ కనిపించకపోవడంతో ఇలా మొదలుపెట్టాల్సి వస్తోంది. తెలుగులో నెగిటివ్ టచ్ ఉన్న, చోటా హీరో పాత్రలు చేస్తూ… కొంత గుర్తింపును సంపాదించుకున్న ఈ హీరో ఒక చిన్న చీప్ గేమ్ ఆడాడు. సరదాగానే అనిపించినా.. అతడి తీరు చాలా మందిని ఆశ్చర్యపరించింది. ఈ వ్యవహారంలో ఇతడు బాలీవుడ్ లో ఇప్పుడు ఒక వెలుగు వెలుగుతున్న సోనమ్ కపూర్ ను ఇన్ వాల్వ్ చేయడమే ప్రధానమైన విశేషం. 

ఇంతకీ మ్యాటరేమిటంటే… ఈ హీరో గారు ట్విటర్ లో ఒక పోస్టు పెట్టారు. దాని సారాంశం ఏమిటంటే.. “harsh will be the biggest star..'' అని సోనమ్ కపూర్ స్టేట్ మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. మరి సోనమ్ కపూర్ ఈ హర్షవర్ధన్ రాణేని ఇంతగా ఆకాశానికెత్తేసింది ఏమిటి?! ఈ హీరోకి, ఆ హీరోయిన్ కి సంబంధం ఏమిటి? అంటూ ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఒక న్యూస్ పేపర్ ఇంటర్వ్యూలో సోనమ్ ఆ స్టేట్ మెంట్ ఇచ్చింది. సోనమ్ ఫొటోను పెట్టి.. ఆ ఫోటోపై ఆ స్టేట్ మెంట్ ను అచ్చేశారు. దాన్ని హైలెట్ చేస్తూ హర్షవర్ధన్ రాణే ట్వీట్ చేశాడు.

మరి అసలు కథ ఏమిటయ్యా.అంటే సోనమ్ కితాబులిచ్చింది ఈ హర్షవర్ధన్ రాణేకి కాదు! తన సోదరుడు హర్షవర్ధన్ కపూర్ కు! త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్న తన సోదరుడిని దృష్టిలో ఉంచుకుని సోనమ్ ఆ స్టేట్ మెంట్ ఇచ్చింది. తమ వాడు స్టార్ అయిపోతాడని చెప్పుకొచ్చింది. దాన్ని కాస్తా ఈ హర్షవర్ధన్ రాణే తన గురించి సోనమ్ స్టేట్ మెంట్ ఇచ్చిందన్నట్టుగా ట్వీట్ చేసి ఆనందించాడు. ఇతడు ఇలా మురిసిపోవడం బాగానే ఉంది కానీ… కొంచెం చీప్ ట్రిక్ అనిపిస్తోందంతే!