..సావిత్రి కి ఏదైనా వరం ఇవ్వడానికి రెడీ అన్నాడు యమ ధర్మరాజు. కానీ పతి ప్రాణంబు దక్క అంటూ చిన్న కండిషన్ పెట్టాడు. ఇలాగే ఓ కండిషన్ పెట్టాడట టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ డైరక్టర్ తన భార్యకు. 'ఏమైనా అడుగు, ఏమైనా కొనుక్కో..ఎక్కడకైనా వెళ్దాం..'ఇలా దేనికైనా ఓకె కానీ తన ఫోన్ పాస్ వర్క్ మాత్రం అడగొద్దు అన్నాడట.
ఈ యంగ్ డైరక్టర్ కు టాలీవుడ్ లో ఇంతో అంతో మంచి పేరే వుంది గ్రంథసాంగుడనే ఇమేజ్ ఏమీ లేదు. మంచి పేరుతో పాటు ఇంతో అంతో బానే సంపాదించారు. అందువల్ల సమస్యలు ఏమీ లేవు. అయినా కూడా స్మార్ట్ ఫోన్ అన్నాక కాస్తో, కూస్తో రహస్యాలు వుంటాయి కదా? అందుకే మొహమాట పడకుండా భార్యతో ఓ జెంటిల్ మన్ అగ్రిమెంట్ కు వచ్చేసాడట.
ఆమె కూడా భార్య అన్నాక భర్తతో సర్దుకుపోవాలి కదా అని ఆలోచించి, ఓకే అనేసారట. అప్పటి నుంచి ఈయనగారి ఫోన్ జోలకి ఆమె రారు. ఈయన ఫోన్ లో ఏవి, ఎలా చలామణీ చేసుకున్నా ఇక సమస్య లేదు. సింగిల్ ఎక్స్ లా? డబుల్ ఎక్స్ లా? ఇంకేమైనా. అటు ఇటు షేర్ చేసేసుకోవచ్చు ధీమాగా.