హీరో రాజశేఖర్ ఇన్నాళ్లకు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. కేవలం సోలో హీరోగా ఇక ముందుకు వెళ్లడం కన్నా, డిఫరెంట్ పాత్రలు చేయడం తన కెరీర్ కొనసాగించేందుకు మంచిది అని డిసైడ్ అయినట్లుంది.
ఈ మేరకు ఆయన ఓ పాత్రను ఓకె చేసారు. డైరక్టర్ శ్రీవాస్ అందించే హీరో గోపీచంద్ సినిమాలో ఓ కీలకపాత్రను హీరో రాజశేఖర్ కు ఆఫర్ చేయగా ఆయన వెంటనే ఓకె అన్నట్లు బోగట్టా.
ఈ పాత్ర నిడివి, తీరు తెన్నులు హీరో పాత్రకు దీటుగా వుంటాయని తెలుస్తోంది. పైగా గోపీచంద్ తండ్రి టి కృష్ణ అంటే రాజశేఖర్ కు గౌరవం. అందుకే అన్ని విధాలా బాగుంటుందని రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
ఎప్పుడో ముఫై ఏళ్ల క్రితం రాజశేఖర్ వేరే హీరోలతో కలిసి నటించారు మళ్లీ ఇన్నాళ్లకు ఇదే. ఇదిలా వుంటే తమిళంలో శివకార్తికేయన్ సినిమాలో కూడా ఓ పాత్ర చేయడానికి డిస్కషన్లు సాగుతున్నట్లు బోగట్టా.