Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అజ్ఞాతవాసి డేట్ కు ఎన్టీఆర్ బయోపిక్

అజ్ఞాతవాసి డేట్ కు ఎన్టీఆర్ బయోపిక్

2018 జనవరి 9 అజ్ఖాతవాసి విడుదల. 2019 జనవరి 9 ఎన్టీఆర్ బయోపిక్ విడుదల? ఇదే వినిపిస్తోంది ఇప్పుడు ఇండస్ట్రీలో. ఎన్టీఆర్ బయోపిక్ కు ఇంకా చాలా వుంది వ్యవహారం. ఇంకా ఇప్పుడు కాస్టింగ్ కాల్ ఇచ్చారు దర్శకుడు క్రిష్. మరోపక్క స్క్రిప్ట్ ను ఆయన తన స్టయిల్ లోకి మారుస్తున్నారు. ఈ రెండు అయిన తరువాత కానీ సినిమా సెట్ మీదకు వెళ్లదు. మహా అయితే అయిదునెలలు సమయం వుంటుంది.

మరి ఈ టైమ్ సరిపోతుందో, కానీ, జనవరి 9కి విడుదలచేసే విధంగా సినిమాను రెడీ చేయాలని బాలయ్య డిసైడ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి సినిమా బాలయ్య సెంటిమెంట్ అన్న సంగతి తెలిసిందే.

క్రిష్-బాలయ్య కలిసి చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతికే వచ్చింది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ ను సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి అన్నది బాగానేవుంది కానీ, డిజాస్టర్ డేట్ అయిన జనవరి 9న విడుదల చేయాలనుకోవడం మాత్రం బాలయ్య అభిమానులను కాస్త కలవరపరుస్తోంది.

ఇదిలా వుంటే బయోపిక్ తరువాత బాలయ్య చేసే వివి వినాయక్ సినిమాకు కూడా త్వరలో ముహుర్తం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ మాత్రం ఇప్పట్లో వుండదని టాక్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?