Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సీటు కోసం కొణతాల బేరం?

సీటు కోసం కొణతాల బేరం?

విశాఖ జిల్లాలో కాస్త పేరు, కొంత ప్రాంతంలో అయినా పట్టు వున్న రాజకీయ నాయకుడు కొణతాల రామకృష్ణ.  వైకాపా నుంచి దూరం జరిగాక న్యూట్రల్ గా వుంటూ వస్తున్నారు. మధ్యలో యాంటీ టీడీపీ స్టాండ్ తో ముందుకు వెళ్లడం ద్వారా, తన పయనం ఎటు అన్నది చెప్పకనే చెబుతూ వచ్చారు. కానీ అలా అని చెప్పి వైకాపాకు దగ్గర కావడం లేదు.

గతంలో భాజపా లోకి వెళ్తారు అని వినిపించింది కానీ అదికూడా మెటీరియలైజ్ కాలేదు. ఇంతలో భాజపా ను బదనామ్ చేసే కార్యక్రమం తెలుగునాట మొదలయింది. కాంగ్రెస్ జస్ట్ అంపైర్ మాదిరిగా చోద్యం చూస్తోంది. ఇక కొణతాలకు వైకాపా మాత్రమే ఏకైక ఆప్షన్ అని అనుకోవాలి. అయినా కూడా కొణతాల ఏ సంగతీ ఫిక్స్ చేసుకోలేదు. ఎందుకని? ఏం జరుగుతోంది?

విశాఖ జిల్లాలో కొణతాల ఏ పార్టీలోకి వస్తే, ఆ పార్టీకి ఇంతో అంతో ఉపయోగం వుంటుంది. కానీ సమస్య ఏమిటంటే, కొణతాల స్వంత నియోజక వర్గమైన అనకాపల్లితోనే ఏపార్టీకి అయినా సమస్య. తెలుగుదేశం పార్టీకి అనకాపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. మార్చాలనుకుంటే, పార్టీలో చాలా మంది వున్నారు. అందువల్ల అక్కడ వేకెన్సీ లేదు. అయినా కూడా వైకాపా వైపు కొణతాల ఎందుకు జరగడం లేదు అన్నదే ప్రశ్న.

వాస్తవానికి విశాఖ జిల్లా వైకాపాలో దీనిపై చాలా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కొణతాల తన కోటా కింద అనకాపల్లి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వదిలేయాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అలా అయితే జిల్లా అంతా తిరిగి పార్టీకి ప్రచారం చేస్తానని అంటున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ రెండూ వైకాపాకు సాధ్యం కానివి. దివంగత రాజకీయ నాయకుడు గుడివాడ గురునాధరావు కొడుకు అమర్ నాధ్ అనకాపల్లి ఎమ్మెల్యే సీటు మీద రుమాలు వేసుకుని కూర్చున్నారు. గతంలో ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి, అత్యంత సులువుగా ఓడిపోయారు. ఈ సారి ఎమ్మెల్యేగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరి అనకాపల్లి కుల రాజకీయాలు, సమీకరణలు తెలిసే మాట ఇచ్చారో, తెలియక ఇచ్చారో, వైకాపా నాయకులు కూడా అమర్ నాధ్ కు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీ సీటు కూడా ఓ మహిళకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. 

దీని వల్ల కొణతాలకు నో వేకెన్సీ అన్నట్లు అయింది. ఇక్కడే బేరం సెట్ కావడం లేదని వినికిడి. పార్టీలోకి వస్తే, అయితే ఎమ్మెల్సీ, లేదా రాజ్యసభ పక్కా అని వైకాపా నేతలు కొణతాలకు రాయబారం పంపుతున్నారు. దీనికి కొణతాల ససేమిరా అంటున్నారు. మరోపక్క మెల్లగా కొణతాల అనుచరులు అంతా జనసేన వైపు సర్దుకుంటున్నారు. ఆ విధంగా కొణతాల కూడా జనసేన వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

కానీ ఏదో బేరం కుదిరి కొణతాల తమ వైపే వస్తారని వైకాపా వర్గాలు ధీమాతో వున్నాయి. జనసేన స్టాండ్ కరెక్ట్ గా లేకపోవడంతో కొణతాలకు కూడా మరో మార్గం వునట్లు కనిపించడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?