Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వైపాఫ్ రామ్ కు భలే చాన్స్

వైపాఫ్ రామ్ కు భలే చాన్స్

ఈ మధ్య యాక్షన్ సినిమాలకు, థ్రిల్లర్ సినిమాలకు హిందీ శాటిలైట్ అండ్ డిజిటల్ మార్కెట్ బాగుంది. పెద్ద సినిమాలకు భారీగానూ, చిన్న సినిమాలకు బడ్జెట్ ను చాలా వరకు కవర్ చేసే విధంగా డబ్బులు చేతికి వస్తున్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, మంచులక్ష్మి చేస్తున్న థ్రిల్లర్

వైపాఫ్ రామ్ కు హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ అన్నీ కలిపి కోటిన్నర రేటు పలికింది. నిజానికి ఇది చిన్న సినిమా. చాలా మీడియం బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. ఇలా కోటిన్నర రావడం ద్వారా దాదాపు సగం ప్రొడక్షన్ ఖర్చు వచ్చేసినట్లే.

ఓ మాంచి ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. దాదాపు నిర్మాణం పూర్తయిన ఈ సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమా తెలుగు శాటిలైట్ హక్కుల బేరం కూడా సాగుతోందని, మంచి ఆఫర్లు వస్తున్నాయని, విడుదలకు ముందే శాటిలైట్ కూడా క్లోజ్ చేసే అవకాశం వుందని నిర్మాణ వర్గాలు తెలిపాయి. వైపాప్ రామ్ చిత్రానికి  విజయ్ యెలకంటి దర్శకత్వం వహిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?