Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అంజలితో గీతాంజలి 2

అంజలితో గీతాంజలి 2

హీరోయిన్ అంజలి కెరీర్ సర్రున పైకి తీసుకెళ్లిన సినిమా గీతాంజలి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. అయితే బ్యానర్, హీరోయిన్ మాత్రమే సేమ్ టు సేమ్. డైరక్టర్ గా కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు. వాస్తవానికి అంజలి సినిమాకు కథ, డైరక్షన్ రాజ్ కిరణ్. ఆ తరువాత అతను అంతగా లైన్లోకి రాలేకపోయారు. హీరోయిన్ అంజలి మాత్రం ఈ సినిమా తరువాత చాలా సినిమాలు చేసింది. మళ్లీ వెనక్కు తగ్గింది.

ఇలాంటి నేపథ్యంలో గీతాంజలి ప్రాజెక్టు ప్లాన్ చేసిన కోనవెంకట్ మళ్లీ మరోసారి గీతాంజలి 2 అంటూ వస్తున్నారు. దీనికి కూడా కొత్త డైరక్టర్ నే. అయితే ఎన్నారైకి రివర్స్ అన్నమాట. అమెరికా సిటిజన్ అయివుండి ఇండియాలో పెరిగిన తెలుగు కుర్రాడు వేదుల సుబ్రహ్మణం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గీతాంజలి సినిమాను నిర్మించి కోన కార్పొరేషన్, ఎంవివి సినిమా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు వివరాలను డ్యాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా ఈ ఆదివారం ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం ఇదే బ్యానర్ మీద ఆదిపినిశెట్టి, తాప్సీ హీరోగా లవర్స్ ఫేమ్ హరి డైరక్షన్ లో ఒక సినిమా నిర్మాణంలో వుంది. ఈ సినిమా జూలై నెలాఖరులో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో కానీ విడుదల అవుతుంది. అది కాగానే గీతాంజలి 2 స్టార్ట్ అవుతుంది. ఆది-తాప్సీ సినిమా ఇంకా ఒక వారంరోజులు షూట్ బాకీ వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?