పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ మాత్రమే కాదు. పోలిటికల్ స్టార్ కూడా. మరి అలాంటపుడు ఆయన ట్విట్టర్ అక్కౌంట్ లో ఇటు పోలిటికల్, అటు సినిమా రెండు రకాల ట్వీట్ లు వుంటే బాగుంటుందా? మిగిలిన వారయితే రెండూ పోస్ట్లు చేస్తారు. కానీ పవన్ కదా? దేని అక్కౌంట్ దానిదే. అందుకే ఇప్పుడు రెండో ట్విట్టర్ అక్కౌంట్ స్టార్ట్ చేసారు. పికె క్రియేటివ్ వర్క్స్ పేరిట మరో కొత్త ట్విట్టర్ అక్కౌంట్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, ఆయన లేటెస్ట్ సినిమా అజ్ఖాతవాసి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ గురించే. అజ్ఖాతవాసి టైటిల్ ను పవన్ ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా ప్రపంచానికి అధికారికంగా తెలియచేయాలన్నది దర్శకుడు తివిక్రమ్ కోరిక. కానీ పోలిటికల్ ట్వీట్ ల నడుమ సినిమా ట్వీట్ లు వుంటే బాగుంటుందా? దీనికి పరిష్కారమే మరో అక్కౌంట్. బహుశా రెండు ట్విట్టర్ అక్కౌంట్ లు కలిగిన సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఏమో?
చిత్రమేమిటంటే అజ్ఞాతవాసి సినిమాలో హీరో (పవన్) తండ్రి అన్నీ రెండు రెండు వుంచుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా వుంటాడని టాక్. అదే సినిమా కోసం ఆ సినిమా హీరో రెండో ట్విట్టర్ అక్కౌంట్ స్టార్ట్ చేయడం యాధృచ్ఛికం కావచ్చు.అజ్ఞాతవాసి టైటిల్ ను రేపు వారణాసిలో విశ్వనాధుని సన్నిథిలో లాంచ్ చేసిన తరువాత పవన్ ట్వీట్ చేస్తారు.