Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎకె చేతిలో షాదీమే జరూర్

ఎకె చేతిలో షాదీమే జరూర్

ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర మరో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. సూపర్ హిట్ హిందీ సినిమా రైట్స్ కొన్నారు ఆయన. బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ దివాళీకి విడుదలయి డీసెంట్ హిట్ అయిన షాదీమే జరూర్ ఆనా సినిమా రీమేక్ హక్కులను అనిల్ సుంకర తీసుకున్నారు.

రాజ్ కుమార్ రావు, కీర్తి కర్బందా నటించి ఈ సినిమాకు రత్నసింహా దర్శకత్వం వహించారు. చిత్రమైన కథతో కూడిన సినిమా ఇది. సినిమా అంతా బాగానే వుంటుంది కానీ క్లయిమాక్స్ మళ్లీ కాస్త సిల్లీగానే వుంటుంది. మరి తెలుగులో తగిన జాగ్రత్తలు తీసుకుని, మార్పులు చేర్పులు చేస్తారేమో?

ఇంతకీ సినిమా రైట్స్ అయితే కొన్నారు కానీ, ఏ హీరోకి వినిపిస్తారో? ఎవరు ఓకె అంటారో? ఎందుకంటే ఇప్పుడు ఏ మీడియం హీరో కూడా అవైలబుల్ గా లేరు. బహుశా తరువాత ఎప్పుడో ఈ సినిమా సెట్ మీదకు తీసుకెళ్తారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?