Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దిల్‌ రాజు సేఫ్‌ గేమ్‌ ఆపాలా?

దిల్‌ రాజు సేఫ్‌ గేమ్‌ ఆపాలా?

గత యేడాది కొన్ని రొటీన్‌ సినిమాలు పాస్‌ అయిపోవడంతో దిల్‌ రాజు ఫార్ములాని విడిచి పెట్టడానికి ఇష్టపడడం లేదు. లాస్ట్‌ ఇయర్‌ తను తీసిన సినిమాల్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న 'ఫిదా' సరికొత్త అనుభూతినిచ్చే కథాంశంతో రూపొందిందని దిల్‌ రాజు విస్మరించాడు. కొత్తదనానికి పెద్ద పీట వేయడం మానేసి రెగ్యులర్‌ సినిమాలతో సేఫ్‌ గేమ్‌ కంటిన్యూ చేస్తున్నాడు.

పోనీ ఇలాంటి సినిమాల వల్ల గ్యారెంటీ రిటర్న్స్‌ వుంటాయంటే ఓకే కానీ శ్రీనివాస కళ్యాణం, లవర్‌ రెండూ డిజాస్టర్లు అయినపుడు ఆ రిస్కేదో కొత్త తరహా కథలతోనే చేయవచ్చుగా అనేది ఇండస్ట్రీ మాట. రొటీన్‌ సినిమాలతో సేఫ్‌ గేమ్‌ ఆడితే పెట్టిన డబ్బుల వరకు గ్యారెంటీ వుండవచ్చు కానీ పెద్ద విజయాలు రావు. అదే కొత్త తరహా చిత్రాలతో భారీ విజయాలు అందుకోవచ్చు.

ఆ సంగతి దిల్‌ రాజుకి బాగా తెలుసు. ఆర్య, బొమ్మరిల్లు లాంటి చిత్రాలతోనే అతని బ్యానర్‌కి ప్రతిష్ట పెరిగింది. కానీ ఇప్పుడలాంటి సినిమాలు తీసేందుకు అతను ఇష్టపడడం లేదు. తన డబ్బుకి రిటర్న్‌ గ్యారెంటీ వుంటే చాలని అనుకుంటున్నాడు. ఈ యేడాది ఎదురవుతోన్న ఫలితాలతో అయినా దిల్‌ రాజు రియలైజ్‌ అయితే తెలుగు సినిమాకి ఏడాదికి కనీసం మూడు మంచి చిత్రాలని అతని తరఫు నుంచి లెక్క వేసుకోవచ్చు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?