Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పార్టీలో చేరడానికి నిరాహార దీక్ష చేయాలా

పార్టీలో చేరడానికి నిరాహార దీక్ష చేయాలా

పరిపూర్ణానంద స్వామిగా ఏం చెప్పినా చెల్లుతుంది. ఎందుకంటే ఆ సమావేశానికి వచ్చేది కేవలం భక్తులు కాబట్టి. అక్కడ చెప్పే విషయాలకు లాజిక్కులు అవసరం లేదు కాబట్టి, కానీ జనజీవన స్రవంతిలో మాట్లాడేటప్పుడు మాత్రం ముందువెనక ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం స్వామీజీ అడుగులకు మడుగులొత్తే భక్తులు మాత్రమే ఉండరు. సామాన్య జనం ఉంటారు. ఆ మాటలకు నవ్వుతారు. జనంలోకి రాబోతున్న పరిపూర్ణానంద మాటలకు జనం ఆల్రెడీ నవ్వులు స్టార్ట్ చేశారు.

పంచపాత్రలో అందరికీ తీర్థం అందించే స్వామీజీ ఎట్టకేలకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ వస్త్రాలు ధరించే పరిపూర్ణానంద.. కాషాయ రంగు టీ-షర్ట్ వేసుకొని, కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువా కప్పుకున్నప్పుడు పరిపూర్ణానంద చెప్పిన లాజిక్ మాత్రం సరిగ్గా పేలలేదు.

9 రోజులు పూర్తి నిరాహార దీక్షలో ఉండి ఆత్మపరిశీలన చేసుకున్నానని, రాజకీయాలకు తాను తగినవాడినేనా? ఇమడగలనా? పనిచేయగలనా? అని ప్రశ్నించుకున్నానని, విజయదశమితో తన 10 రోజుల దీక్ష పూర్తయిందని అందుకే ఈరోజు పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు పరిపూర్ణానంద.

ఇలా కండువా కప్పుకోగానే అలా తన మాటల గారడీ ప్రారంభించారు పరిపూర్ణానంద. 9 రోజులు నిరాహార దీక్ష చేసి రాజకీయాల గురించి ఆయన ఆలోచించారో లేదో తెలీదు కానీ, ఆ 9 రోజుల్లో బీజేపీతో బాగానే బేరసారాలు సాగించారనే విషయం అందరికీ తెలుసు. అందుకే జనాలు నవ్వుకుంటున్నారు. అంతేకాదు, గతంలో ఓసారి ఇదే పనిమీద ఢిల్లీ వెళ్లి వచ్చిన పరిపూర్ణానంద, ఇప్పుడు నిరాహార దీక్ష గురించి చెప్పడం విడ్డూరం.

మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ఇలా చాలానే చెప్పారు పరిపూర్ణానంద. ఏదేమైనా సరిగ్గా ఎన్నికల సీజన్లో మోడీ అభివృద్ధి పరిపూర్ణానందకు కనపడ్డం, దానికి ఆయన ఆకర్షితులవడం కాస్త వింతగానే అనిపించినా బీజేపీ వ్యూహం మాత్రం ఫలించిందనే చెప్పాలి.

ఓవైపు టీఆర్ఎస్ తో స్నేహపూర్వక పోటీని కొనసాగిస్తూనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మహాకూటమికి వెళ్లకుండా చేయడం బీజేపీ టార్గెట్. అందుకే తెలంగాణలో ఉన్న నాయకుల కంటే ఓ ఛానెల్ ఎండీ అయిన స్వామీజీని వారు బాగా నమ్మారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?