Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కార్తికేయ 2 టీజర్ వచ్చింది

కార్తికేయ 2 టీజర్ వచ్చింది

హెడ్డింగ్ లో తేడా అనిపించవచ్చు కానీ సుబ్రహ్మణ్యపురం సినిమా టీజర్ చూస్తుంటే అచ్చంగా అలాగే అనిపిస్తుంది. కార్తికేయకు మరో పేరే సుబ్రహ్మణ్యస్వామి. సినిమా టైటిల్ ఆ విధంగా సెట్ చేసుకున్నట్లే, కథ కూడా అలాగే తయారుచేసినట్లు కనిపిస్తోంది. సుమంత్-ఈషారెబ్బా జంటగా నటించిన  సుబ్రహ్మణ్యపురం సినిమా టీజర్ బయటకు వచ్చింది. 

సినిమా టీజర్ చూస్తుంటే ఆద్యంతం కార్తికేయ సినిమానే మళ్లీ మార్చి తీస్తున్నట్లు అనిపిస్తోంది. ఓ గుడి, ఆ గుడి చుట్టూ మిస్టరీ, లాజిక్ ను, సైద్ధాంతిక వాదాన్ని నమ్ముతూ, మూఢనమ్మకాలకు దూరంగా వుండే హీరో, హత్యలు, ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ కలిసి కార్తికేయ 2 అని చెప్పకుండా, సుబ్రహ్మణ్యపురం అని టైటిల్ తో తీస్తున్న ఫీలింగ్ ను కలిగించాయి.

టీజర్ ఆసక్తికరంగానే వుంది. ఎందుకంటే ఈ సస్సెన్స్, మర్టర్ మిస్టరీలు ఆసక్తిగానే వుంటాయి చాలామందికి. పైగా గుడి, దేవుడు చుట్టూ మిక్స్ చేసారు కాబట్టి మరింత ఆసక్తి. కార్తికేయను ఫాలో అయితే అయ్యారు కానీ, కొత్తగా సీన్లు, లైన్ వుంటే బాగానే వుంటుందేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?