రవితేజ ఇప్పటికే ఓ సినిమా ఫినిష్ చేసాడు. శ్రీనువైట్ల కాంబినేషన్ లోని అమర్ అక్బర్ ఆంథోని సినిమా పూర్తయింది. సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో తెరి రీమేక్ చేయాల్సి వుంది. కానీ దానికి కొన్ని సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా హిందీ డబ్బింగ్, టెలికాస్ట్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది.
దీంతో ఇప్పుడు ఆ స్టోరీని మళ్లీ మార్చేసారు. తెరి లైన్ మాత్రం తీసుకుని, మొత్తం సీన్లు కొత్తగా రాసుకున్నారు. అంటే క్యారెక్టర్లు, లైన్ తెరి సినిమావే. కానీ సీన్లు మాత్రం అస్సలు అనుసరించరు. ఈ సినిమాను త్వరలో సెట్ మీదకు తీసుకెళ్లడానికి నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీస్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
బహుశా ఈ నెలాఖరులో కానీ, వచ్చేనెల ఆరంభంలో కానీ సినిమాకు క్లాప్ కొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీస్ ఇప్పటికే చేతిలో వున్న రవితేజ, నాగ్ చైతన్య సినిమాలు ఫినిష్ చేసింది. విజయ్ దేవరకొండ సినిమా సెట్ మీద వుంది. సాయి దరమ్, రవితేజ సినిమాలు సెట్ మీదకు తీసుకెళ్లబోతోంది. వచ్చే ఏడాది మహేష్-సుకుమార్ సినిమా ప్రారంభించే లోగా వీటన్నింటిని ఫినిష్ చేయాలన్నది నిర్మాతల ప్లాన్.