ఆకాశంలో ఓవర్ సీస్ రేట్లు

రాను రాను తెలుగు సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ పెరుగుతోంది. పెరగడం మాత్రమే కాదు ట్రెండ్ కూడా ఛేంజ్ అవుతోంది. ఒకప్పుడు ఓవర్ సీస్ కాదు ఇప్పుడు. త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, మహేష్ బాబు…

రాను రాను తెలుగు సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ పెరుగుతోంది. పెరగడం మాత్రమే కాదు ట్రెండ్ కూడా ఛేంజ్ అవుతోంది. ఒకప్పుడు ఓవర్ సీస్ కాదు ఇప్పుడు. త్రివిక్రమ్, శేఖర్ కమ్ముల, మహేష్ బాబు ఇలా ఓ పద్దతి.. క్లాస్ టచ్ వున్న సినిమాలు మాత్రమే ఓవర్ సీస్ లో రేట్లకు నోచుకునేవి. 

కానీ కోవిడ్ తరువాత పరిస్థితి మారింది. వేలకొద్దీ కొత్త జనరేషన్ మన కుర్రాళ్లు విదేశాల్లో వున్నారు. ముఖ్యంగా యుఎస్ లో. వీళ్లంతా మాస్ సినిమా ప్రియులు. పక్కా మాస్ మసాలా సినిమాలకు మహారాజ పోషకులు. అందువల్ల ఇప్పుడు ఓవర్ సీస్ లో అన్ని రకాల సినిమాలు ఆడతాయి అన్న నమ్మకం వచ్చింది. కానీ సబ్జెక్ట్ టు కండిషన్ ఒక్కటే. సినిమా బాగుండాలి అంతే. అది పరమ బూతు సినిమానా? హర్రర్ సినిమానా? యాక్షన్ సినిమానా అన్నది కాదు.

అందుకే ఇప్పుడు నిర్మాతలు తమ తమ సినిమాలకు ఓవర్ సీస్ రేట్లు గట్టిగా చెబుతున్నారు. బయ్యర్లు కూడా కాస్త ధైర్యం చేస్తున్నారు. మార్కెట్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇంకా బేరాలు సెటిల్ కావాల్సిన సినిమాల రేట్లు ఇలా వున్నాయి. నిర్మాత డిమాండ్ ఇది. ఏ రేటుకు సెటిల్ అవుతాయన్నది తరువాత సంగతి.

పవన్ కళ్యాణ్ ఓజి..18 కోట్లు

నాని హాయ్ నాన్న…8 కోట్లు

రామ్-బోయపాటి స్కంధ.…5 కోట్లు

సూర్య కంగువా…45 కోట్లు

ఇంకా రాబోయే చిన్నా, పెద్దా సినిమాల రేట్లు కూడా ఆకాశంలో వున్నాయి. కానీ సమస్య ఏమిటంటే ఏదో ఒక పాయింట్ దగ్గర బేరం సెటిల్ త్వరగా చేసుకోవాలి. లేదూ అంటే లాస్ట్ మినిట్ వరకు వుండిపోతే ఓన్ రిలీజ్ కు వెళ్లాల్సి వుంటుంది. ఓ పెద్ద హీరో సినిమా 18 కోట్లు చెప్పారు. అలా అలా 12 వరకు వచ్చారు. బయ్యర్లు ఎవరూ తొమ్మిది కోట్లు దాటి ముందుకు రాలేదు. దాంతో ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది.

అందువల్ల నిర్మాతలు ఆలోచించి బేరం ఆడాలి. బయ్యర్లు కూడా మరీ వేలాం వెర్రిగా ముందుకు వెళ్లినా కష్టమే.