అఖిల్ సినిమాతో హీరోగా పూర్తి సినిమా తొలిసారి చేసిన అఖిల్ ఇప్పుడు రిలాక్సయ్యాడు. సినిమా విడుదలయిపోయింది. టాక్ బయటకువచ్చేసింది. ఇక తాను చేయగలిగింది ఏమీ లేదు. తన వంతు ప్రమోషన్ ఎంత చేయాలో అంతా ముందే చేసేసాడు. ఇక ఇక్కడ వుండి ఇంకా ఈ సినిమా గురించే ఆలోచిస్తూ, ఈ వ్యవహారాల్లోనే వుండడం ఇష్టం లేక, ఛలో గోవా అన్నాడని వినికిడి. హాయిగా మూడు నాలుగు రోజులు అక్కడ రిలాక్సయి రావాలన్నది అఖిల్ ప్లాన్ గా తెలుస్తోంది.
అక్కడి నుంచి రాగానే రెండో సినిమా పై దృష్టి పెడతాడు. ఇప్పటికే ఓ నిర్మాతకు సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, సరైన కథ, డైరక్టర్ల కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి టాప్ డైరక్టర్ లు ఎవరూ ఖాళీగా లేరు. రెండు మూడు నెలలు ఆగితే కొందరు ఖాళీ అవుతారు. అందువల్ల అంతవరకు కథలు వింటూ, రిలాక్స్ కావడమే.