ఒక చైనా సామెత వుందట ఎప్పుడో.. చదివాను …మనిషి ఎలాంటివాడో అన్నది చీకటి పడితేనే తెలుస్తుందట ..అలా అన్నట్టు దీన్ని మన “తెగులు చానల్స్ ” క్షమించాలి “తెలుగు చానల్లుకి ” అన్వయించుకుంటే ఏ చానల్ ఎలాంటిదో తెలుసుకోవాలంటే ..రాత్రి 11 దాటాకా చూడాల్సిందే ..అరోగ్యం పేరిట ఒక చానలు ..శృంగారం పంచుతుంది ..శృంగారం అంటే రాఘవేంద్ర రావు గారి పాటలు లాంటివి కాదండోయ్ అన్ని బి గ్రేడు మలయాళం సినిమా సీన్సే ..ఇలా ఏదో ఒక పేరు పెట్టి శృంగారాన్ని తప్పు తప్పు బూతు ని చూపిస్తున్నాయి .. అలా పంచుతున్నవి అల్లాటప్పా చానల్స్ కాదు మరి అన్నీ పేరున్న చానల్సే ….రాత్రి 11 నుండి 12 వరకు ఏవో కొన్ని చానల్స్ తప్పించి మిగతావన్ని రకరకాల పేర్లు తో బూతును పంచుతున్నాయి …
అప్పుడెప్పుడొ ఒక చానల్ లోనే మిడ్ నైట్ మసాలా వచ్చేది ఇప్పుడు చాలా చానల్స్ ఆ మషాలా పంచుతున్నాయి ముఖ్యంగా న్యూస్ చానల్స్ ..భార్యా భర్తలు క్రొత్తగా పెళ్ళైన వారి కోసం అని సరిపెట్టుకున్నా ..వారు మాత్రమే చూడరు కదా …టీనేజ్ పిల్లలు కూడా చూసే అవకాశం వుంది ….మాములుగా కూడ సినిమా పాట వచ్చింది అంటే ప్రక్కన పిల్లలు వుంటే చాలా ఇబ్బంది గా వుంటుంది …కుటుంబం తో సినిమా చూడాలి అంటేనే భయంగా వుంటుంది …సినిమాలేం ఖర్మ ..ఈ మద్య ప్రసారం అవుతున్న టీవి కామెడీ షోలు కూడా అలానే తగలడ్డాయి అవి కూడా చూడలేకపోతున్నాము ..వెకిలి కామెడీ మగవాళ్ళతో ఆడ వేషాలు వేయించి వారి వెకిలి చేస్టలుతో (దాన్ని కామెడీ అని మనం సరిపెట్టుకోవాలి ) ఆడవారిని జుగుప్సకరంగా చూపిస్తున్నారు …ద్వందార్ధాలు ..కొట్టటం …శాడిజం (శాడిజం , కొట్టటమే కామెడీ అనే దరిద్రం చానాల్ల క్రితమే వచ్చేసింది కోటా బాబూ మోహన రూపమ్లో ) ఇప్పటికీ అదే దరిద్రం కామెడీని వెంటాడుతుంది ..
మరి ఆ చానలే కాస్తో కూస్తో హుందాతనానికి తెలుగు ప్రాభవానికి మారు పేరు ..దానికి ఒక భాద్యత గల మహిళా శాసన సభ్యురాలు జడ్జ్ …ఇది మరీ సిగ్గు చేటు ..ఆ కామెడీ చాలా మందికి నవ్వు తెప్పిస్తుంది ..(నాకు కూడా ..నవ్వు తెప్పిస్తుంది .) కాని వాళ్ళు మరి కొంచెం హుందాగా ఆ కామెడీ ప్రోగ్రాం నడిపితే బావుంటుంది ..ప్రజలు ఏమైనా చూస్తారు ..వారు చూస్తున్నారు కాబట్టి మేం తీస్తున్నాం చూపిస్తున్నం అంటే అంతకంటే వెర్రితనం మరొకటి వుండదు ….మీరు తీసిన మంచి సినిమాలు కార్యక్రమాలు ఎన్ని ఆదరించ లేదు ? భక్తి చానల్స్ కి అతుక్కు పోయిన లక్షలాది మంది వున్నారు …అలా అని భక్తే చూపించమనట్లేదు ..వీటి వలన మీరు ప్రజలను యువతను తప్పుదోవ పటిస్తున్నారు అని గుర్తు పెట్టుకోండి ..మీడియా అంటే ఎదో ఒక రాజకీయ పార్టీకి అమ్ముడై పోవాల్సిన ఖర్మ ఎలగూ కాలిపోతుంది ..కనీసం ఇలాంటి విషయాల్లో అయినా సమాజం పట్ల మీ భాద్యత నెరవేర్చుకోండి
ఇక సీరియళ్ళ గురించి వేరే చెప్పాలా..సీరియళ్ళలో ఆడవారిని చాలా నీచాతి నీచంగా చూపిస్తున్నారు ..సీరియల్ చూస్తున్నంత సేపు టీ వి తెర వణకాల్సిందే …ఒసే ..ఏమే …అరుపులు కేకలు …ఆ దిక్కుమాలిన హావభావాలుతొనే సగం సీరియల్ నడిపేస్తున్నారు …పగ పగ ..ఇదే ప్రధానం ..ఎత్తులు పై ఎత్తులు ..అయితే అతి సహనం ..లేదా అతి భయంకరం ఇది చాలదన్నట్టు ..మళ్ళీ వాటి గురించి స్క్రొ లింగులు ..వసుందర రాగిణి పై పగ తీర్చుకుంటందా (పేర్లు మార్చాను ) ..6.30 కి చూడండి …ఒక ప్రక్క మనుషుల బలహీనతలు అమాయకత్వంనే పెట్టుబడిగా కార్పోరెట్ మొబైల్ కంపెనీలు బ్రతికేస్తున్నాయి ..మరో ప్రక్క తెగులు చానల్స్ కూడా మనుషుల బలహీనతలు వున్నంత కాలం సిగ్గు లేకుండా సుభీక్షంగా బ్రతికేస్తాయి ..
మీగడ త్రినాధ రావు