'అఖిల్' డిజాస్టర్ తరువాత హీరో అఖిల్ మరో సినిమా మొదలుపెట్టడానికి ఇప్పటి దాకా ముహుర్తం కుదరడం లేదు. ఎన్ని కథలు విన్నారు..ఎందరు డైరెక్టర్లు ట్రయ్ చేసారు. కానీ ఫలితం లేకపోయింది. ఆఖరికి విక్రమ్ కుమార్ లాంటివాడి స్క్రిప్ట్ కూడా రిజక్ట్ అయింది. మరో లైన్ ఓకె కావడంతో, మళ్లీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయింది. విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ దగ్గరే శిల్పంలా చెక్కుతారు.
అఖిల్ సినిమాకు మార్చిలో ఫార్మల్ ముహుర్తం చేసి, పెళ్లి, హడావుడి అయిన తరువాత సెట్ మీదకు వెళ్తారని వినికిడి. అక్కడి నుంచి కనీసం ఆరేడు నెలలు టైమ్ తీసుకుంటారు విక్రమ్ కుమార్ సినిమాకు. పైగా అఖిల్ సినిమా షాక్ తో నాగ్ కానీ, అఖిల్ కానీ తీసుకుంటున్న కేర్ ఇంతా అంతా కాదు. పైగా ఈ సినిమాకు కాస్టింగ్ ఇప్పటి వరకు ఇంకా స్టార్ట్ కాలేదు. ఎంత స్పీడ్ గా చేసినా 2017 చివరకు వచ్చేస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే అఖిల్ సినిమా విడుదల ఈ ఏడాది కష్టమేమో?