ఈ మెగా వార్త నమ్మేదేనా?

మెగాస్టార్ చిరంజీవి-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..ఈ కాంబినేషన్ లో సినిమానా? పోలా..అదిరిపోలా? వార్తే ఇంత కిక్కిస్తే, సినిమా ఇంకెంత కిక్కిస్తుందో? కానీ ఇలాంటి కాంబినేషన్ సాధ్యమేనా? అని…

మెగాస్టార్ చిరంజీవి-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మెగా డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..ఈ కాంబినేషన్ లో సినిమానా? పోలా..అదిరిపోలా? వార్తే ఇంత కిక్కిస్తే, సినిమా ఇంకెంత కిక్కిస్తుందో? కానీ ఇలాంటి కాంబినేషన్ సాధ్యమేనా? అని ఎక్కడో చిన్న అనుమానం. కానీ ప్రకటించింది చిన్నా చితకా వ్యక్తి కాదు. టీ. సుబ్బరామి రెడ్డి. తను, మరో నిర్మాత అశ్వనీదత్ కలిసి ఈ సినిమా నిర్మిస్తాం అంటున్నారు. కానీ ఎంతవరకు సాధ్యమో, సినిమా పట్టాలు ఎక్కేదాకా నమ్మలేం.

ఎందకుంటే త్రివిక్రమ్ వరుసగా మూడు సినిమాలు చేయాల్సి వుంది. అలాగే పవన్ మూడు సినిమాలు చేయాల్సి వుంది. మెగాస్టార్ రెండు సినిమాలు చేయాల్సి వుంది. వాటి తరువాతనే ఈ సినిమా. ఈలోగా ఏం తేడాలు వస్తాయో? ఏం జరుగుతాయో? ఎవరికి ఎరుక? అందుకే ఇంకొకరితో, వేరేకరితో సినిమా అంటే వేరు. పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే వేరు. థియేటర్లలోకి వచ్చేవరకు నమ్మలేం.

నిజంగా ఇలాంటి సినిమా ఒకటి రావాలే కానీ, దాని రేంజ్ 200 కోట్లకు వుంటుంది. ఎందుకంటే ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ అలాంటిది కదా?